HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Bjp Chief Bandi Sanjay Hard Comments On Cm Kcr

Bandi: ‘కేసీఆర్’ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ‘బండి సంజయ్’

యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాలాడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

  • Author : Balu J Date : 22-03-2022 - 3:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాలాడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తన పాలన పట్ల ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే కేసీఆర్ ఇలాంటి డ్రామాలాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దుకాణం బంద్ అయ్యిందని… రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా చెల్లిస్తోంది కేంద్రమేనని… ఇకపైనా కేంద్రం తెలంగాణ రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసేది బ్రోకరిజమేనని చెప్పారు. ‘ కేసీఆర్… చేతనైతే బ్రోకరిజం చెయ్.. కమీషన్ తీసుకో… చేతగాకుంటే ఇంట్లో పడుకో… అంతే తప్ప రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకో… లేకుంటే రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ’’అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇవాళ(మంగళవారం) ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, ఢిల్లీలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజ్, పార్టీ నేత లంకల దీపక్ రెడ్డితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… యాసంగి వడ్ల కొనుగోలు, కశ్మీర్ ఫైల్స్, మోదీ పాలన విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం కేసీఆర్ కు వయసు మీద పడింది. మతి తప్పింది. గంటల కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నాడు. తన పాలనపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు రోజుకో కొత్త సమస్యను సృష్టించి దాని ద్వారా జల్సా చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రజల దృష్టి మళ్లించేందుకే వడ్ల పేరిట డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. నిన్న కూడా పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారు. రా రైస్ కొంటామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు బియ్యం సేకరణపై స్పందించినా… తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు స్పందించలేదని, గతంలో ఇచ్చిన బియ్యం కూడా ఇయ్యలేదని క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు. విధివిధానాల్లేవని పీయూష్ గోయల్ గతంలోనూ పార్లమెంట్ సాక్షిగా చెప్పారని అన్నారు బండి సంజయ్. ఇన్నాళ్లు బాయిల్డ్ రైస్ కొనాలని డ్రామాలాడిన కేసీఆర్, ఇప్పుడు మాటమార్చి వడ్లు మాత్రమే కొనాలని మళ్లీ కొత్త డ్రామా చేస్తున్నాడు. గతంలో ధాన్యం మొత్తం కొనేది మేమే అన్నాడు. కేంద్రం గింజ కూడా కొనడం లేదన్నాడు. కేంద్రం వద్దకు పోయి ‘భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోము’’అని సంతకం చేస్తాడు.

బయటకొచ్చి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందేనని మారుస్తాడు కేసీఆర్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బండి సంజయ్. కేంద్రం మెడమీద కత్తిపెడితే రాసిచ్చినని అబద్దాలు చెబుతాడు. బాయిల్డ్ రైస్ కొనకుంటే ఇండియా గేట్ దగ్గర వడ్లు పారబోస్తానన్నాడు. అంతకుముందు మళ్లీ బాయిల్డ్ రైస్ కొనకుంటే మరి ఎందుకు ఆనాడు పోయలేదు? మళ్లీ ఈసారి వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నట్లు ప్రకటించారు… ఇప్పుడు కేంద్రమే వడ్లు కొనాలని అంటున్నాడు కేసీఆర్ అని విమర్శలు చేశారు బండి సంజయ్. గతంలో వరి వేస్తే ఉరే గతి అని రైతులను బెదిరించి.. ఆయన మాత్రం ఫాంహౌజ్ లో వరి పంట వేసి కోటీశ్వరుడు అయ్యాడు.. రైతులను బికారి చేస్తాడు.. రైతులు ఇబ్బంది పడుతుంటే రాక్షసానందం పొందుతున్నాడు. నీలాంటి వ్యక్తి సీఎంగా కొనసాగడం బాధాకరం. కేసీఆర్… అసలెందుకీ డ్రామాలు? కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది కదా… ఎందుకు సహకరించడం లేదు? వడ్లు మాత్రమే కొనాలని ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు? కేంద్రం అనేకసార్లు మీటింగ్ పెడితే ఎందుకు చెప్పలేదు? నీ మూర్ఖత్వంవల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే జల్సా చేస్తావా? రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలెందుకు… ఇలానే చేస్తే… రైతులు తిరగబడే రోజులు వస్తాయి జాగ్రత్త అని హెచ్చరించారు బండి సంజయ్. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడ్డరని మా దగ్గర సమాచారం ఉంది. దీనిపై సమగ్ర విచారణ ఎందుకు జరపడం లేదు? బియ్యం అక్రమాలపై గతంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తే విచారణ జరిపితే నిజమేనని తేలినా… ఎందుకు చర్యలు తీసుకోలేదు… భవిష్యత్తులో ఇలాంటివి జరగబోవని కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నావే తప్ప, ఎందుకు అక్రమాలను ఆపలేకపోతున్నావ్ కేసీఆర్ అంటూ విమర్శించారు బండి సంజయ్.

ప్రజలకు నీ కుప్పిగంతులన్నీ తెలిసిపోయాయి… నీపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక నీ దుకాణం బందైనట్లే… ఏదో ఒక తికమక చేసి మభ్యపెట్టాలనుకుంటున్నావు. నీ పప్పులుడకవు. నిన్నెవరూ నమ్మరు అని విమర్శించారు బండి సంజయ్.
4 రాష్ట్రల్లో బీజేపీ గెలవడంతోనే కేసీఆర్ మైండ్ దొబ్బింది. అందుకే నిన్నటిదాకా ముందస్తు ఎన్నికలని ఊదరగొట్టి… ఇప్పుడు ముందస్తు లేదంటూ పారిపోయాడు… పైగా సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతున్నాడు.. సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వచ్చింది బీజేపీకి… టీఆర్ఎస్ కు వచ్చేది 5 లేకుంటే… 9 సీట్లే..అని అన్నారు బండి సంజయ్. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కేసీఆర్… నీకు వచ్చిన ఇబ్బందేమిటి? అంత అక్కసు ఎందుకు? నీకు నచ్చేది కేడీ నెంబర్ వన్… మోసగాళ్లకు మోసగాడు వంటివే కదా… 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్ లో జరిగిన నష్టమేంటో తెలుసుకో… కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఊచకోతపై వాస్తవ విషయాలను ప్రజలకు చూపిస్తే… జనం ఆలోచనలో పడితే… దీనిని పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన బుద్దులు చూపిస్తావా? అని తీవ్ర స్థాయిలో విమర్శించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

బోధన్ లో 35 మందిపై 307 కింద కేసు పెట్టారు. సిరిసిల్లలో 25 మంది కార్యకర్తలపై 307 కేసు పెట్టి జైల్లో వేశారు. కేసీఆర్ కు….బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక, పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. మాకు కేసులను ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు.. ఉద్యమాలు తెలుసు… త్యాగాలు తెలుసు…. నీలాంటి పిరికిపందను ఎట్లా తరిమి కొట్టాలో కూడా మాకు తెలుసు అని అన్నారు బండి సంజయ్. మోదీ పాలన యూపీఏ పాలన కంటే అధ్వాన్నమంటావా…. యూపీఏలో నువ్వు (కేసీఆర్) మంత్రి వి కదా.. నీపై వచ్చిన సహారా, ఈఎస్ఐ స్కాంలు తెలీదా? నీలాగ పాలన చేయడం మోదీకి చేతగాదు.. యూపీఏ పాలనకు, మోదీ పాలనకు లింకు పెట్టడమంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు అన్నారు బండి సంజయ్. మోదీ అద్బుత పాలనను చూసి విదేశాలే కీర్తిస్తున్నాయి.. పక్కనున్న పాకిస్తాన్ ఫ్రధాని సైతం మోదీ విదేశాంగ విధానం భేష్.. ఆయన పాలన చూసి నేర్చుకోవాలని పొగుడుతున్న సంగతి తెలీదా? ఆ బుద్ధి కూడా నీకు లేదా? అని కేసీఆర్ ను విమర్శించారు బండి సంజయ్. ఉక్రెయిన్ లో భారత విద్యార్థులను యుద్దం ఆపించి తీసుకొచ్చిన ఘనత నరేంద్రమోదీదే… ఉక్రెయిన్ విద్యార్థులు చావుబతుకుల మధ్య కొట్లాడుతుంటే… ఏ ఒక్కనాడు నోరు విప్పని సీఎం కేసీఆర్… ఇవాళ మేమే కాపాడామంటూ చెప్పుకోవడం సిగ్గు చేటు.. ఏ ఒక్క కుటుంబాన్ని కలవకుండా.. ఓదార్చకుండా రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్న మానవ మృగం కేసీఆర్… ఉక్రెయిన్ విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రమే భరోసా ఇస్తే… భయపడి ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ఫ్లైట్ బుక్ చేసిన నాయకుడు కేసీఆర్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • chief minister KCR
  • hard comments
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd