Car Fire: కారు బోల్తా..మంటల్లో చిక్కుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్
ఉత్తర ప్రదేశ్ లో కారు అగ్నికి ఆహుతి అయింది. కొత్వాలీ సెక్టార్-39 ప్రాంతంలో హాజీపూర్‌లో ఉన్న యూ-టర్న్ డివైడర్‌ను కారు ఢీకొని బోల్తా పడింది.
- Author : Praveen Aluthuru
Date : 27-06-2023 - 7:49 IST
Published By : Hashtagu Telugu Desk
Car Fire: ఉత్తర ప్రదేశ్ లో కారు అగ్నికి ఆహుతి అయింది. కొత్వాలీ సెక్టార్-39 ప్రాంతంలో హాజీపూర్‌లో ఉన్న యూ-టర్న్ డివైడర్‌ను కారు ఢీకొని బోల్తా పడింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇంజనీర్‌తో సహా ఇద్దరు స్నేహితులు మంటల్లో తీవ్రంగా గాయపNడ్డారు. స్థానికులు వారిని ఎలాగోలా కారులోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. ముజఫర్‌నగర్‌కు చెందిన వైభవ్ త్యాగి ముంబైలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ అర్థరాత్రి వైభవ్ తన స్నేహితుడు వినయ్‌తో కలిసి ఐ-20 కారులో ఫరీదాబాద్ నుంచి నోయిడాకు వస్తున్నాడని అతని తండ్రి విపిన్ త్యాగి తెలిపారు.
नोएडा के हाजीपुर के पास डिवाइडर से टकराने एक कार में आग लग गई और कार में सवार दो लोग गंभीर रूप से झुलस गए। राहगीरों ने दोनों को किसी तरह से बाहर निकाला।#Noida @noidapolice @Uppolice @JagranNews pic.twitter.com/LAu1xsb9er
— Shyamji Tiwari (@M_ShyamJi) June 27, 2023
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read More: Mamata Banerjee Injured: సీఎం మమతా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ .. మోకాలికి గాయం