Ganja: ఉపాధి లేక గంజాయి సాగు చేస్తున్నటీచర్లు.. ఎక్కడంటే..?
కరోనా వైరస్ అన్ని రంగాలను దెబ్బతీసింది. ముఖ్యంగా విద్యారంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రెండు సార్లు లాక్ డైన్ రావడంతో స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో చాలామంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు.
- By Hashtag U Published Date - 09:40 AM, Mon - 7 February 22

కరోనా వైరస్ అన్ని రంగాలను దెబ్బతీసింది. ముఖ్యంగా విద్యారంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రెండు సార్లు లాక్ డైన్ రావడంతో స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో చాలామంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ కాలానికి స్కూల్ యాజామాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో పాటు చాలా మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. దీంతో వారంతా ఉపాధి లేక రోడ్డున పడ్డారు. అయితే వారు ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్న గంజాయి సాగుపై దృష్టి సారించారు. ఆదాయం కోసం టీచర్లు గంజాయి సాగు చేపట్టారు. విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై లీడ్స్ రాబట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు తమ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం.
ఈ నివేదికలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ ఇళ్లు, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో గంజాయిని పండించడాన్ని ఎంచుకున్నారని వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి అత్యధికంగా గంజాయి వచ్చి హైదరాబాద్ మీదుగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోంది. కేవలం పది శాతం గంజాయిని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. నేరస్తులు కింగ్‌పిన్‌లకు మెటీరియల్‌ను సరఫరా చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకున్నారు. వారు తమ వినియోగదారులకు మెటీరియల్‌ను అక్రమంగా రవాణా చేసి సరఫరా చేస్తారని నిఘా వర్గాలు తెలిపాయి. ఎక్కువగా నైజీరియన్లు రాష్ట్రాలలోకి తీసుకువచ్చే నిషేధిత పదార్ధాలలో హెరాయిన్, కొకైన్, ఎఫెడ్రిన్, చరస్, హషీష్ మరియు MDMA ఉన్నాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులతో సహా వ్యసనపరులు పెడ్లర్లుగా మారారని.. ఈ చైన్ లింక్ ద్వారా ఎక్కువగా గంజాయి సరఫరా అవుతుందని పోలీసులు అంటున్నారు