Viral video: తరగతి గదిలో నిద్రపోతున్న టీచర్…గాలి విసురుతున్న విద్యార్థిని..!!
ఉపాధ్యాయురాలు నిద్రిస్తుంటే...విద్యార్థిని గాలి విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.
- By hashtagu Published Date - 09:23 PM, Tue - 7 June 22
ఉపాధ్యాయురాలు నిద్రిస్తుంటే…విద్యార్థిని గాలి విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న కొందరు టీచర్లకు…బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటనే నిదర్శనం. విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యార్థులతో చాకిరి చేయించుకుంటున్నారు. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగాహి పురైనా గ్రామంలోని కతర్వా ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఈ దృశ్యం జరిగింది. విసనకర్రతో ఓ విద్యార్థిని ఊపుతుంటే…ఉపాధ్యాయురాలు నిద్రిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు…టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Video link: https://www.instagram.com/tv/CebH7BdJMPo/?utm_source=ig_web_copy_link
Tags
Related News
Midgut Volvulus : మెలితిరిగిన పేగులకు శస్త్ర చికిత్స.. పూణే వైద్యుల ప్రతిభ..!
మిడ్గట్ వోల్వులస్కు శస్త్రచికిత్స చేసి, పేగులు మెలితిరిగిన స్థితిలో ఉన్న నాలుగేళ్ల బాలుడికి పూణేలో వైద్యులు కొత్త జీవితాన్ని అందించారు.