TDP : విజయవాడ బస్‌స్టాండ్ వద్ద టీడీపీ నేతల ఆందోళన.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా పలువురు అరెస్ట్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈ రోజు ఏపీ బంద్‌కి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే
- Author : Prasad
Date : 11-09-2023 - 9:13 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈ రోజు ఏపీ బంద్‌కి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున నుంచే టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. బస్ డిపోల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్యకర్తలు ధర్నాకి దిగారు. దీంతో బస్సులు అన్ని నిలిచిపోయాయి. ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.