TDP On Fire Incident: ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు
ఏలూరులోని ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- By Hashtag U Published Date - 10:15 AM, Thu - 14 April 22

ఏలూరులోని ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నూజివీడు నియోజకవర్గం లోని అక్కిరెడ్డి గూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రాణనష్టం విచారకరమని చంద్రబాబు అన్నారు.
ఇప్పటికే 6 గురు చనిపోవడంతో పాటు 12 మంది తీవ్రం గా గాయపడడం పై అవేదన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని.. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ విషయంలో యాజమాన్యాలు రాజీ పడకూడదు అన్నారు. ప్రభుత్వం సైతం నిత్యం తనిఖీల ద్వారా ప్రమాదాల నివారణకు పని చేయాలని చంద్రబాబు తెలిపారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకోవాలని…బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఫ్యాక్టరీలు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా.. లేదా.. పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని… ఎల్జీపాలిమర్స్ బాధితులకు ఇచ్చిన పరిహారాన్ని పోరల్ కెమికల్ ఫ్యాక్టరీ బాధితులకు కూడా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లా, ముసునూరు మండలం, అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదం దురదృష్టకరం. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను pic.twitter.com/xtazV4hn5h
— N Chandrababu Naidu (@ncbn) April 14, 2022