73 Years Young Man : 73 ఏళ్లలోనూ 25 ఏళ్ల యువకుడి ఉత్సాహం.. అలుపెరగని ప్రజా పోరాటయోధుడు చంద్రబాబు
73 Years Young Man : ఆయన 73 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా ప్రజా ఉద్యమమై ఉరుముతున్నాడు.
- By Pasha Published Date - 08:57 AM, Sat - 9 September 23

73 Years Young Man : ఆయన 73 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా ప్రజా ఉద్యమమై ఉరుముతున్నాడు.
జనం కోసం తపిస్తున్నాడు.. మహర్షిలా తపస్సు చేస్తున్నాడు.
ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా.. ప్రజాపక్షంగా మున్ముందుకు సాగుతున్న జననేత నారా చంద్రబాబు నాయుడు.
ప్రజల కోసం .. ప్రజల మనిషిగా మాట్లాడే చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆందోళనకు గురయ్యారు. వయసు మీద పడినా నిత్యం జనం మధ్యే ఉంటున్న చంద్రబాబును అరెస్టును ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. వరుస సభలు , సమావేశాలు జరుపుతూ ఏమాత్రం అలసిపోకుండా టీడీపీ క్యాడర్ తో మమేకమవుతున్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి యువకుడిని ఆదర్శప్రాయుడు. సమయ పాలనలో చంద్రబాబు ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఆయన ఏ పనిచేసినా ఒక టైం టేబుల్ ప్రకారం చేస్తారు. పార్టీ క్యాడర్ ను కూడా అంతే క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిస్తారు. ఈవిషయంలో అస్సలు రాజీపడరు.
Also read : Ganta Srinivas Arrest : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్.. అదే కేసులో..!
నంద్యాల జిల్లా బనగానపల్లెలో..
గత శుక్రవారం రోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో చంద్రబాబు మహిళలతో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఓ మహిళ ఆసక్తికర ప్రశ్న అడిగింది. “సార్.. మిమ్మల్ని మేం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పటికీ అలాగే ఉత్సాహంగా ఉన్నారు. నేటికీ మీరు అలుపెరగకుండా పనిచేస్తుంటారు. ఇది ఎలా సాధ్యం?” అని ఆ మహిళ ప్రశ్నించారు. దానికి టీడీపీ చీఫ్ స్పందిస్తూ.. “నా ఆరోగ్య రహస్యం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు?” అని ఆ మహిళను తిరిగి ప్రశ్నించారు. “మీరే చెప్పాలి సార్” అని ఆ మహిళ చెప్పగా.. చంద్రబాబు ఆన్సర్ ఇవ్వడం మొదలుపెట్టారు. “మొదటిది.. మనం చేసే పనిలో ఆనందం పొందాలి. నేను ప్రజల కోసం పనిచేస్తాను. అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న ఆనందంతో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే నేను ఉదయం నుంచి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటాను’’ అని టీడీపీ చీఫ్ చెప్పారు.
Also read : CBN ARREST : నా అరెస్టు వెనుక పెద్ద కుట్ర : చంద్రబాబు
నాకు అలసట అనేది ఉండదు :చంద్రబాబు
‘‘రాత్రివేళ నిద్రపోవాలి కాబట్టి నిద్ర పోతాను తప్ప నాకు అలసట అనేది ఉండదు. నిద్రపోవడం వల్ల బ్యాటరీ మాదిరిగా రీచార్జ్ అవుతాను. ఇక రెండోది.. తినే తిండి కూడా చాలా ముఖ్యమైనది. మనందరం భోంచేస్తుంటాం. అయితే ఆ తినే ఆహారం పోషక విలువలతో కూడుకున్నదై ఉండాలి. అది కూడా సమతుల ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి తగిన శక్తి అందుతుంది.. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. మీరు బాగా నిద్రపోయారా, ఏం తిన్నారు? అనే అంశాలను ఇవాళ సెన్సర్ల సాయంతో తెలుసుకోగలుగుతున్నాం. నేను ఒకటే చెబుతాను.. సెల్ ఫోన్ ను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అదే మీ ఆరోగ్య పరిరక్షణ సాధనం అవుతుంది” అని చంద్రబాబు వివరించారు.