Revanth Reddy: రాహుల్ ను ప్రధాని చేయడమే వైఎస్సార్ కల!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి.
- By Balu J Published Date - 12:36 PM, Fri - 8 July 22

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ కు ఘన నివాళులు అర్పిస్తున్నారు. వైస్సార్ 73 వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ టీ కాంగ్రెస్ ప్రత్యేక నివాళి అందించింది. ఈ సందర్భంగా టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియానుద్దేశించి మాట్లాడారు. సంక్షేమాన్ని ,అభివృద్ధి ని రెండు కళ్లుగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఆరోజు దేశంలో నే నెంబర్ 1 గా నిలబెట్టిన నాయకుడు వైస్సార్ అని ఆయన సేవలను కొనియాడారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడుగా ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు అని, కాంగ్రెస్ పార్టీపై అటుమోడీ ఇటు కేసీఆర్ కుట్రలు తిప్పికొట్టడానికి వైస్సార్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి అన్నారు.
పేదల సంక్షేమం కోసం ఆరోగ్య శ్రీ ,ఉచిత కరెంటు ,ఫీజు రియంబర్స్మెంట్,మైనార్టీ లకు 4 శాతం రిజర్వేషన్లు ,ఔటర్ రింగ్ రోడ్డు ,అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ మెట్రో రైలు ,జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించారని వైఎస్సార్ సేవలను గుర్తు చేశారు. ఆయన అమరులైన వారి పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారని, చివరి కోరిక నెరవేరకుండానే వైస్సార్ మనకు దూరమయ్యారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ని ప్రధాని ని చేయడమే రాజశేఖర్ రెడ్డి కోరిక అని, 2009 లో కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తన లక్ష్యం రాహుల్ గాంధీ ని ప్రధాని ని చేయడమే అని ప్రకటించారని రేవంత్ వెల్లడించారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడు అని, వైస్సార్ ఆలోచనలు కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
ఆ రోజే… వైఎస్ కు నిజమైన నివాళి
ప్రాంతాలకు అతీతంగా పేదవాడి గుండెల్లో సంక్షేమ సంతకం వైఎస్ఆర్…
చివరి శ్వాస వరకు కాంగ్రెస్ ఉన్నతి కోసం తపించిన నేత. శ్రీ రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా చూడాలన్న వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త… ఆయన అభిమానులు కృషి చేయడమే నిజమైన నివాళి. pic.twitter.com/h16bmDBJKJ— Revanth Reddy (@revanth_anumula) July 8, 2022