Tamil Nadu Reains: డిసెంబర్ 28 వరకు తమిళనాడులో వర్షాలు
డిసెంబర్ 28 వరకు తమిళనాడు, పుదువై, కారైకల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది.
- By Praveen Aluthuru Published Date - 06:16 PM, Sat - 23 December 23

Tamil Nadu Reains: డిసెంబర్ 28 వరకు తమిళనాడు, పుదువై, కారైకల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా శనివారం నుండి గురువారం వరకు తమిళనాడు, పుదువై మరియు కారైకల్‌లోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల ఉదయం పూట తేలికపాటి పొగమంచు కురిసే అవకాశం ఉంది.
వర్షాల నేపథ్యంలో మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కుమరిక్ సముద్ర ప్రాంతాలు మరియు దానిని ఆనుకుని ఉన్న మాల్దీవులు – లక్షద్వీప్ ప్రాంతాల్లో శనివారం గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ఇటీవల తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. తిరునేల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
Also Read: Health: జలుబుతో బాధపడుతున్నారా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు