Afghanistan: తాలిబన్ల అరాచకాలు.. ఫోటో జర్నలిస్టు విడుదల
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రజల్ని హింసించడమే కాకుండా జర్నలిస్టులకి సైతం స్వేచ్ఛ లేకుండా పోతుంది.
- By Praveen Aluthuru Published Date - 09:59 AM, Sun - 27 August 23

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రజల్ని హింసించడమే కాకుండా జర్నలిస్టులకి సైతం స్వేచ్ఛ లేకుండా పోతుంది. గతవారం తాలిబన్లు ఓ ఫోటో జర్నలిస్టుని నిర్బంధించిన విషయం తెలిసిందే. ఇరాన్ ఫోటో జర్నలిస్టు హుస్సేన్ ని తాజాగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ సెమీ-అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. అయితే రిపోర్టర్‌ను ఇంకా ఇరాన్‌కు బదిలీ చేయలేదని వార్త సంస్థ నివేదించింది. .
ఫోటో జర్నలిస్టు హుస్సేన్ ఆగస్ట్ 19న తన 10 రోజుల ఆఫ్ఘనిస్తాన్ పర్యటన ముగించుకుని ఇరాన్‌కు తిరిగి వస్తుండగా అతనిని తాలిబన్లు నిర్బంధించారు, అతను వైమానిక సరిహద్దు, జిన్‌హువా ద్వారా చట్టబద్ధంగా ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించాడని ఆరోపిస్తూ తాలిబాన్ దళాలు అతనిని అరెస్టు చేశారు.
Also Read: ODI Rankings: వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా పాకిస్థాన్.. భారత్ స్థానం ఎక్కడంటే..?