BJP MLAs: స్పీకర్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు.
- By Balu J Published Date - 12:08 PM, Tue - 15 March 22

సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ సస్పెన్షన్‌పై ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, స్పీకర్‌ను ఆదేశించలేమని పేర్కొంటూ నిర్ణయాన్ని అసెంబ్లీ స్పీకర్‌కు అప్పగించిన కోర్టు మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడంతో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.