Sunil Again Hero: మళ్లీ హీరోగా సునీల్!
సునీల్ కమెడియన్‌గా ఒక దశాబ్దానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమను శాసించాడు.
- Author : Balu J
Date : 20-05-2022 - 5:36 IST
Published By : Hashtagu Telugu Desk
సునీల్ కమెడియన్‌గా ఒక దశాబ్దానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమను శాసించాడు. “అందాల రాముడు”, “మర్యాద రామన్న” విజయాల తరువాత చాలా సంవత్సరాల పాటు కామెడీ పాత్రలకు దూరంగా ప్రధాన పాత్రలను పోషించాడు. కానీ హీరోగా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. మళ్లీ కామెడీ పాత్రల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సునీల్ మాత్రం కమెడియన్‌గా కాకుండా క్యారెక్టర్ యాక్టర్‌గా, విలన్‌గా సక్సెస్‌ని సాధించాడు. చాలా సినిమాల్లో అలాంటి పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే లీడ్‌హీరో రోల్స్ పై ఆశలు వదులుకోలేదు. సునీల్ త్వరలో ఓ భారీ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. మళ్లీ హీరోగా నటించనున్నాడు. సునీల్ త్వరలోనే “ఎఫ్ 3” తో అలరించనున్నాడు.