HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sukesh Chandrasekhar Released Another Letter From Jail

Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు హైద‌రాబాద్ నుంచి ముడుపులు.. జైలు నుంచి సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ మ‌రో లేఖ

దుబాయ్‌లో మూడు అపార్ట్‌మెంట్‌ల కొనుగోలు లావాదేవీల‌పై నాకు సత్యేందర్ జైన్‌కు మధ్య జ‌రిగిన మూడు పేజీల వాట్సాప్ చాట్‌ను త్వరలో విడుదల చేస్తాన‌ని లేఖ‌లో సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ తెలిపాడు.

  • Author : News Desk Date : 02-07-2023 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aravind Kejriwall
Aravind Kejriwall

మండోలి జైలు (mandoli jail) లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మ‌రో లేఖ‌ను విడుద‌ల చేశారు. జైలు నుంచి త‌న న్యాయ‌వాది అనంత మాలిక్ ద్వారా సంచ‌ల‌న విష‌యాల‌తో కూడిన లేఖ‌ను మీడియాకు విడుద‌ల చేశారు. ఢిల్లీ శాంతి భద్రతలపై మాట్లాడుతున్న సీఎం కేజ్రీవాల్, అతని సహచరులు నన్ను, నా కుటుంబాన్ని బెదిరిస్తున్నార‌ని లేఖ‌లో పేర్కొన్నాడు. నా త‌ల్లికి ఫోన్‌చేసి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే జైలులో విషంపెట్టి నీ కొడుకును చంపేస్తామని కేజ్రీవాల్ సన్నిహితులు బెదిరించారంటూ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ లేఖ‌లో రాశారు.

కేజ్రీవాల్ దిగజారి సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నాడ‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించాడు. కేజ్రీవాల్ ఇతరులను నిందించే ముందు తమని తాము చూసుకోవాలని, త్వరలో కేజ్రీవాల్ కూడా తీహార్ జైలులో చేరతాడంటూ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ లేఖ‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. హైదరాబాదులోని ఫార్మా కాంట్రాక్టర్ నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ముడుపులు అందాయ‌ని సుఖేష్ వెల్ల‌డించాడు. 2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్‌లో మూడు అపార్ట్ మెంట్లు కొనుగోలు చేశాడ‌ని, వారంరోజుల క్రితం మూడు అపార్ట్ మెంట్ల‌ను కేజ్రీవాల్ అత్యవసరంగా అమ్మకానికి పెట్టాడ‌ని అన్నారు.

దుబాయ్‌లో మూడు అపార్ట్‌మెంట్‌ల కొనుగోలు లావాదేవీల‌పై నాకు సత్యేందర్ జైన్‌కు మధ్య జ‌రిగిన మూడు పేజీల వాట్సాప్ చాట్‌ను త్వరలో విడుదల చేస్తాన‌ని లేఖ‌లో సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ తెలిపాడు. వారంరోజుల్లో ఈడీ, అవినీతి నిరోధక విజిలెన్స్‌కి ఆధారాలు పంపిస్తాన‌ని సుఖేంద‌ర్ చెప్పాడు.

Telangana BJP: అధ్య‌క్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్ రెడ్డి .. బండి, ఈట‌ల ఎడ‌మొహం పెడ‌మొహం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delhi CM Kejriwal
  • dubai
  • mandoli jail
  • Released Another letter
  • sukesh chandra shekhar

Related News

Flights

మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

యుద్ధ పరిస్థితుల వల్ల రద్దవుతున్న మొత్తం విమానాల్లో 50% నుండి 65% వరకు కేవలం దుబాయ్ రూట్‌కు చెందినవే ఉన్నాయి.

  • Sonu Sood

    దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా సోనూ సూద్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd