TDP : టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మునిరామయ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో
- Author : Prasad
Date : 07-02-2023 - 6:37 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మునిరామయ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఆయనతో పాటు అయన కుమారుడు ప్రవీణ్ కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. ముని రామయ్య శ్రీకాళహస్తి ఎమ్మేల్యే గా, తుడా చైర్మన్ గా పని చేశారు. ప్రవీణ్ వైసీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రెటరీ గా ఉన్నారు. వీరితో పాటు వైసీపీ కి చెందిన మరో 22 మంది నేతలు కూడా టీడీపీలో చేరారు. టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ నేతృత్వంలో ఈ చేరికలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనను నిరసిస్తూ ఆ పార్టీ వీడినట్లు నేతలు తెలిపారు. టీడీపీ తోనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య తెలిపారు.