US – Russia Friendship : భూమిపై కుస్తీ .. స్పేస్ లో దోస్తీ.. అమెరికా, రష్యా వెరైటీ సంబంధాలు
US - Russia Friendship : అమెరికా, రష్యా.. ఈ రెండు దేశాలు బద్ధ విరోధులు అని అందరికీ తెలుసు.
- Author : Pasha
Date : 16-09-2023 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
US – Russia Friendship : అమెరికా, రష్యా.. ఈ రెండు దేశాలు బద్ధ విరోధులు అని అందరికీ తెలుసు. తాజాగా ఇవి రెండూ ఫ్రెండ్లీగా మారాయి. ఎక్కడో తెలుసా ? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో!! అంతరిక్ష కేంద్రంలో పనిచేయడానికి తాజాగా బయలుదేరి వెళ్లిన వ్యోమగాముల టీమ్ లో ఇద్దరు రష్యన్ ఆస్ట్రోనాట్స్, ఒక అమెరికా ఆస్ట్రోనాట్ ఉన్నారు. శుక్రవారం కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ కేంద్రం నుంచి వారు రష్యన్ అంతరిక్ష నౌక ‘సోయుజ్’ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వారంతా సురక్షితంగా ఐఎస్ఎస్ కు చేరుకున్నారని రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇప్పటికే డ్యూటీలో ఉన్న వ్యోమగాముల టీమ్ లో నాసాకు చెందిన జాస్మిన్ మోఘ్‌బెలి, ఫ్రాంక్ రూబియో, రష్యాకు చెందిన డిమిత్రి పెటెలిన్, కాన్స్టాంటిన్ బోరిసోవ్, సెర్గీ ప్రోకోపీవ్, డెన్మార్క్‌కు చెందిన ఆండ్రియాస్ మోగెన్‌సెన్, జపాన్‌కు చెందిన సతోషి ఫురుకావాల ఉన్నారు. ఇప్పుడు వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు కూడా ఆ టీమ్ తో కలిసి ఐఎస్‌ఎస్ లో పనిచేయనున్నారు. వీరంతా దాదాపు ఏడాది పాటు అక్కడే ఉండి రీసెర్చ్ చేయనున్నారు.