HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sonia Gandhis Dinner Invite To Aap

Sonia Gandhi Invite To AAP : ఆప్ కు సోనియా గాంధీ ఆహ్వానం.. జులై 17న 24 విపక్షాలకు డిన్నర్

Sonia Gandhi Invite To AAP :  విపక్ష కూటమి ఏర్పాటు దిశగా జరుగుతున్న పరిణామాలు కీలక మలుపు తిరిగాయి.. 

  • Author : Pasha Date : 12-07-2023 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sonia Gandhi Invite To Aap
Sonia Gandhi Invite To Aap

Sonia Gandhi Invite To AAP :  విపక్ష కూటమి ఏర్పాటు దిశగా జరుగుతున్న పరిణామాలు కీలక మలుపు తిరిగాయి.. 

బెంగళూరులో జూలై 17, 18 తేదీల్లో (సోమ, మంగళవారాలు) జరిగే విపక్ష మీటింగ్ కు రావాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా మొత్తం  24 పార్టీలకు ఆహ్వానం అందింది.

ఈ మీటింగ్ లో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా పాల్గొననున్నారు.  

కాంగ్రెస్ ను బాహాటంగా విమర్శిస్తున్నప్పటికీ.. ఢిల్లీ, పంజాబ్ లలో బలంగా ఉన్న ఆప్ ను వదులుకునేందుకు విపక్ష కూటమి రెడీగా లేదని దీంతో స్పష్టమైంది.

మరో కీలకమైన విషయం ఏమిటంటే.. బెంగళూరు మీటింగ్ కు ఒకరోజు ముందు (జూలై 17 న) సోనియాగాంధీ  విపక్ష పార్టీల నేతలకు విందు (డిన్నర్)  ఇవ్వనున్నారు.

ఈ డిన్నర్ కు కూడా ఆప్ ను ఆహ్వానించడం గమనార్హం.  

ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సఖ్యత, ఐక్యతను పెంచేందుకు ఈ డిన్నర్ ను(Sonia Gandhi Invite To AAP) సోనియా ఇస్తున్నట్టు తెలుస్తోంది. 

Also read : Good News Moviegoers : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ఇక చీప్

ఢిల్లీ సర్కారు అధికారాలకు  కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ పార్టీ లిఖిత పూర్వక మద్దతును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ  కోరుతోంది. అయితే జూలై 17 డిన్నర్ వేదికగా  సోనియా గాంధీ దీనిపై కేజ్రీవాల్ కు ఏదైనా హామీ ఇస్తారా ? ఆర్డినెన్స్ అంశంలో మద్దతును ప్రకటిస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు బెంగళూరులో జులై 17, 18 తేదీల్లో జరిగే విపక్ష మీటింగ్ లో మొత్తం 24 పార్టీలు పాల్గొంటాయని సమాచారం.  ఇంతకుముందు జూన్ 23న జరిగిన విపక్షాల మొదటి మీటింగ్ లో 15 పార్టీలు మాత్రమే పాల్గొన్నాయి. ఈ నెల రోజుల వ్యవధిలో మరో 8 పార్టీలను కాంగ్రెస్ తన వైపు తిప్పుకోగలిగింది. బెంగళూరు మీటింగ్ లో పాల్గొననున్న 8 కొత్త పార్టీల లిస్ట్ లో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK), కొంగు దేశ మక్కల్ కట్చి (KDMK), విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) ఉన్నాయి.

Also read : Garuda Drone Flood Fight : వరదలపై డ్రోన్ల యుద్ధం.. టెక్నాలజీని వాడుకుంటున్న ఎన్డీఆర్ఎఫ్

2014 ఎన్నికల సమయంలో బీజేపీకి మిత్రపక్షాలుగా వ్యవహరించిన  KDMK, MDMK పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు రావడం మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతం. మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీలో చీలిక ఏర్పడి..  అజిత్ పవార్ 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో జులై 18 మీటింగ్ ప్రాధాన్యాన్నిసంతరించుకుంది. విపక్ష పార్టీల సంఖ్య పెరగడం బీజేపీ వ్యతిరేక  కూటమి ఏర్పాటు దిశగా జరుగుతున్న  ప్రయత్నాలకు బలం ఇవ్వనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP
  • Arvind Keriwal
  • Bengaluru meeting
  • Call To AAP
  • congress
  • Dinner Invite
  • Opposition Meet
  • Patna Meeting
  • sonia gandhi
  • Sonia Gandhi Invite To AAP

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd