kodada: అత్తగారి ఇంటి దగ్గర నిరసనకు దిగిన అల్లుడు.. అసలేం జరిగిందంటే?
సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు చిలికి చిలికి గాలి వానగా
- By Anshu Published Date - 06:34 PM, Sun - 2 April 23

సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు చిలికి చిలికి గాలి వానగా మారుతుంటాయి. అవే గొడవలు ఇద్దరి మధ్య దూరం పెంచడంతో పాటు కొన్ని సార్లు విడాకులు తీసుకోవడం, లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, ఒకరికొకరు చంపుకోవడం లాంటివి చేస్తున్నారు. చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగే గొడవలకు పిల్లలు బలవుతున్నారు. పెళ్లి చేసుకొని పిల్లలు కనీ విడాకులు తీసుకుని విడిపోవడంతో పిల్లల భవిష్యత్తు ఎటు కాకుండా ప్రశ్నార్థకంగా మారుతోంది.
తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్తారింటిముందు అల్లుడు నిరసనకు దిగాడు. అసలేం జరిగిందంటే.. కోదాడలో అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగాడు. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆ అల్లుడు ఆరోపిస్తున్నాడు. భార్య భర్తలైన ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే బాబుని తల్లిదండ్రుల చెంతనే ఉంచి పృథ్వీ రమణీ కెనడా వెళ్లింది. కుమారుడిని చూసేందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది.
వారం వారం కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్, తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రవీణ్ తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తల్లిదండ్రులతో కలిసి నిరసనకు దిగిన ప్రవీణ్ తన కొడుకుని చూపించాలంటూ ఆరోపిస్తున్నాడు.