Uttam Kumar Reddy: నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- By Hashtag U Published Date - 03:38 PM, Fri - 23 June 23

పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ వీడుతున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ మారుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు.
తాను కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ నిండటంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరిట పెద్ద నాయకులకు వల వేయాలని భావిస్తుంది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నేతలపై గురిపెట్టనున్నట్టు తెలుస్తోంది.
Also Read: Ram Charan: మెగా ఇంటికి మహాలక్ష్మి.. పాప పేరుపై రామ్ చరణ్ క్లారిటీ