4 Childerns Injured : బెంగాల్‌లో సాకెట్ బాంబ్ పేలుడు.. నలుగురు చిన్నారులకు గాయాలు
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో సాకెట్ బాంబ్ పేలుడు కలకలం రేపింది. గురుదాస్‌పూర్‌లో రోడ్డు పక్కన
- By Prasad Published Date - 07:16 AM, Tue - 18 July 23

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో సాకెట్ బాంబ్ పేలుడు కలకలం రేపింది. గురుదాస్‌పూర్‌లో రోడ్డు పక్కన ఆడుకుంటుండగా సాకెట్ బాంబు పేలడంతో నలుగురు చిన్నారులు గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు గాయపడిన చిన్నారులను రక్షించి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం పిల్లలు కల్వర్టు దగ్గర ఆడుకుంటుండగా వారిలో ఒకరు కల్వర్టు కింద అడవుల్లో దాచిన సాకెట్ బాంబ్‌ను గమనించారు.వారు బాంబును రోడ్డుపైకి విసిరారని.. దీంతో భారీ పేలుడు సంభవించడంతో నలుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దౌల్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాలార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బబ్లా గ్రామంలో శనివారం ఉదయం జరిగిన మరో బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు చిన్నారులు కూడా గాయపడ్డారు.