Kerala: కేరళలో ఆరుగురు బాలికల అదృశ్యం..?
కోజికోడ్‌లోని వెల్లిమడుకున్నులో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలికల చిల్డ్రన్స్ హోంలో ఆరుగురు బాలికలు అదృశ్యమయ్యారు. చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- By Hashtag U Published Date - 07:49 PM, Thu - 27 January 22
కోజికోడ్‌లోని వెల్లిమడుకున్నులో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలికల చిల్డ్రన్స్ హోంలో ఆరుగురు బాలికలు అదృశ్యమయ్యారు. చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోజికోడ్‌కు చెందిన ఐదుగురు బాలికలు, కన్నూర్ కి చెందిన స్థానిక బాలిక రిపబ్లిక్ డే వేడుకల తర్వాత సంస్థ ఆడిటోరియంలో నుంచి అదృశ్యమయ్యారు. ఈ బాలికలు 14 నుండి 16 సంవత్సరాల వయస్సు గలవారని ఫిర్యాదులో పేర్కోన్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని చెవాయూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ చంద్రమోహన్ తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా కమిషన్ సభ్యురాలు బి బబిత బాలల గృహాన్ని సందర్శించనున్నారు. విచారణ ముమ్మరం చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి, బాలల గృహ సూపరింటెండెంట్‌లను కమిషన్ ఆదేశించింది.