Desk Work Tips : గంటల తరబడి డెస్క్ వర్క్ చేస్తున్నారా ? హెల్తీగా ఉంచే టిప్స్ ఇవీ
Desk Work Tips : ఆఫీసుల్లో డెస్క్ వర్క్ చేసేవాళ్లు గంటల తరబడి కంప్యూటర్ ఎదుట కూర్చోవాల్సి వస్తుంటుంది.
- By Pasha Published Date - 04:15 PM, Sat - 10 February 24

Desk Work Tips : ఆఫీసుల్లో డెస్క్ వర్క్ చేసేవాళ్లు గంటల తరబడి కంప్యూటర్ ఎదుట కూర్చోవాల్సి వస్తుంటుంది. ఇలా గంటల తరబడి కూర్చొని పనిచేస్తే.. పలు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇలాంటి వాళ్లు హెల్తీగా ఉండటానికి ఏం చేయాలనే దానికి సంబంధించిన కొన్ని టిప్స్ తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join
రిస్క్ పెంచే డెస్క్ వర్క్
డెస్క్ వర్క్ చేసేవారి సంఖ్య ఇప్పుడు రోజురోజుకూ పెరుగుతోంది. గంటల తరబడి డెస్క్ వర్క్(Desk Work Tips) కొనసాగించడం వల్ల ఒత్తిడి అలుముకుంటుంది. ఈ వర్క్ చేసేవాళ్లు శారీరక శ్రమకు దూరమైపోతారు. ఉదయాన్నే లేచి ఆఫీసుకు వెళ్తారు. వర్క్ కంప్లీట్ కాగానే సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేస్తారు. ఈ విధమైన దినచర్యలో డెస్క్ వర్క్ చేసేవాళ్లకు కనీస వ్యాయామం కూడా చేసే టైం ఉండదు. ఇదే ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేస్తుంది. ఎక్కువ సేపు సిస్టమ్ ఎదుట కూర్చోడం వల్ల హైబీపీ, షుగర్, గుండె జబ్బులు, నడుము చుట్టూ కొవ్వు పెరగడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
విరామం అవసరం
మీరు డెస్క్ వర్క్ చేసే క్రమంలో కనీసం గంటకు ఒకసారి చిన్న విరామం తీసుకోండి. అదేపనిగా కంప్యూటర్‌ను చూస్తే మీ కళ్లు నొప్పిగా ఫీల్ అవుతాయి. కంటికి చిరాకు కూడా అనిపిస్తుంది. ఒకసారి కుర్చీ పైనుంచి లేచి వెళ్లి గ్లాసు నీళ్లు తాగి రండి.దీనివల్ల మైండ్ కొంత రిలాక్స్ అవుతుంది. వర్క్ చేసే క్రమంలో వచ్చే బ్రేక్ టైంలో.. ఆఫీస్ చుట్టూ ఉండే పరిసరాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి కాసేపు నడవాలి. ఇలా చేస్తే బాడీ కాస్త రిలాక్స్ అవుతుంది.హెల్త్‌కు కూడా ఇది మంచిది.
వ్యాయామం చేయండి
డెస్క్ వర్క్ చేసేవారు సమయానికి భోజనం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ కొంత సమయం వ్యాయామం చేయాలి. కొంతదూరం నడవాలి. స్విమ్మింగ్ చేయడం మరీ మంచిది. ఇవిచేస్తే పని ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. యోగా, ధ్యానం చేస్తే ఇంకా బెటర్.
స్టాండింగ్ ఛైర్ వాడండి
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు స్టాండిగ్ చైర్‌ను వాడితే బెటర్. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల స్టాండింగ్ చైర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడితే ఎక్కువసేపు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
జూమ్ మీటింగ్ వేళ వాక్
వర్క్ ఫ్రం హోం చేసేవాళ్లకు తరుచుగా జూమ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఈక్రమంలో జూమ్ మీటింగ్‌కు లాగిన్ అయ్యాక.. వాకింగ్ చేస్తూ మీటింగ్ వివరాలను ఆసక్తిగా వినాలి. ఇలా చేయడం వల్ల ఏకకాలంలో వాకింగ్‌తో పాటు మీటింగ్ కూడా పూర్తవుతుంది.