UP : శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చిన మున్సిపల్ అధికారులకు షాక్..గోడలో నుంచి బయటపడ్డ..!!
గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
- By hashtagu Published Date - 10:33 AM, Tue - 11 October 22

గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే బదౌన్ జిల్లా బిల్సీలో శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చివేశారు మున్సిపల్ సిబ్బంది. బుల్డోజర్ సాయంతో ఇంటిని కూల్చుతుండగా..ఓ గోడలో నుంచి వెండి నాణేలు వరదలా జారి పడ్డాయి. దీంతో కూల్చివేతను నిలిపివేసిన అధికారులు…వెండినాణేలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 168 నాణేలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
వీటిని తహసీల్ అడ్మినిస్ట్రేషన్ కు అప్పగించారు. ఈ నాణేలు 1890 సంవత్సరానికి చెందినవిగా గుర్తించారు. ఒక నాణెం 10 గ్రాముల బరువు ఉంటుందన్నారు. ఈ ఇల్లు మాధవరం సిద్ధ్ పూర్ గ్రామానికి చెందినది. కొన్ని వివాదాల కారణంగా ఇళ్లు నిర్మాణం జరగలేదు. గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉండటంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయం ఊరంతా తెలియడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.