HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shreyas Iyers Unbeaten 74 Leads Ind To Victory

Ind vs SI: భారత్ దే సిరీస్

సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వెస్టిండీస్ పై టీ ట్వంటీ, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్ తాజాగా శ్రీలంకపైనా షార్ట్ ఫార్మేట్ లో సిరీస్ కైవసం చేసుకుంది.

  • Author : Hashtag U Date : 26-02-2022 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jadega Iyer Imresizer
Jadega Iyer Imresizer

సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వెస్టిండీస్ పై టీ ట్వంటీ, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్ తాజాగా శ్రీలంకపైనా షార్ట్ ఫార్మేట్ లో సిరీస్ కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. గుణలతిక , నిస్సాంక తొలి వికెట్ కు 67 పరుగులు జోడించారు. మిడిలార్డర్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగినా… నిస్సాంకకు తోడుగా కెప్టెన్ శనక మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో లంక భారీ స్కోరే సాధించింది. కెప్టెన్ శనక కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. నిస్సాంక 75 , గుణలతిక 38 పరుగుల చేశారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది.

ఛేజింగ్ లో ఈ సారి భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది.రోహిత్ శర్మ 1 , ఇషాన్ కిషన్ 16 పరుగులకే ఔటవగా.. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశారు. అయ్యర్ కేవలం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేయగా… శాంసన్ 39 రన్స్ కు ఔటయ్యాడు. తర్వాత జడేజా చెలరేగిపోవడంతో భారత్ 17.1 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. జడేజా కేవలం 18 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 45 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది. సిరీస్ లో మూడో మ్యాచ్ ఆదివారం ధర్మశాలలోనే జరుగుతుంది.

Pic Courtesy- BCCI/Twitter

11th T20I win on the bounce for #TeamIndia 👏👏@Paytm #INDvSL pic.twitter.com/zsrm3abCls

— BCCI (@BCCI) February 26, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india beat sri lanka 2-0
  • India Beat Srilanka
  • india wins 7th consecutive time
  • rajendra jadega
  • shreyas iyer
  • team india

Related News

    Latest News

    • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

    • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

    • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

    • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

    • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

    Trending News

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

      • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

      • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

      • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd