Suicide: శివసేన ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య.. విచారణ చేస్తున్న పోలీసులు
కుర్లా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
- Author : Hashtag U
Date : 18-04-2022 - 11:13 IST
Published By : Hashtagu Telugu Desk
కుర్లా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సబర్బన్ కుర్లాలోని తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. మంగేష్ కుడాల్కర్ భార్య రజనీ కుడాల్కర్ మృతదేహం కుర్లా ఈస్ట్‌లోని నెహ్రూ నగర్ ప్రాంతంలోని డిగ్నిటీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని తన ఫ్లాట్‌లో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని కనిపించిందని పోలీసు అధికారి తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా అనేది కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని నెహ్రూ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.