IPL 2022: ఐపీఎల్ లో వాట్సన్ సెకెండ్ ఇన్నింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ ఐపీఎల్‌లోకి మళ్ళీ పునరాగమనం చేయనున్నాడు.
- By Naresh Kumar Published Date - 08:33 AM, Thu - 24 February 22

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ ఐపీఎల్‌లోకి మళ్ళీ పునరాగమనం చేయనున్నాడు. స్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్ లో వాట్సన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఉండనున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆహ్వానం మేరకు షేన్ వాట్సన్ ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్ లో చేరేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది..
ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో రాజస్తాన్ రాయల్స్ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలవడంలో షేన్ వాట్సన్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన వాట్సన్ 2018లో ఐపీఎల్ ఫైనల్లో ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించాడు.. ఇక ఫిట్ నెస్ లేమితో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి వాట్సన్ ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో 145 మ్యాచ్‌లను ఆడిన వాట్సన్ 3,874 పరుగులు చేశాడు.
ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలున్నాయి. ఆల్‌రౌండర్ అయిన వాట్సన్ 92 ఐపీఎల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మొత్తంగా షేన్ వాట్సన్ తన టి20 కెరీర్‌లో 343 మ్యాచ్‌లు ఆడి 8,821 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 216 వికెట్లు కూడా పడగొట్టిన వాట్సన్ 101 క్యాచ్‌లు అందుకున్నాడు.