Shakuntalam: విడుదలకు సిద్ధంగా సమంత ‘శాకుంతలం’…!
గుణశేఖర్ - సమంత కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'శాకుంతలం'. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇక ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషించింది.
- By Hashtag U Published Date - 08:05 PM, Thu - 3 February 22
గుణశేఖర్ – సమంత కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శాకుంతలం’. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇక ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషించింది. ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఇది. కథ విషయానికొస్తే, హిందూ పురాణాలకు చెందిన ‘శాకుంతల-దుష్యంతుడి’ ప్రేమకథతో ఈ సినిమాని అద్భుతంగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ‘శాకుంతలం’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ముందునుంచి ఈ సినిమాపై మేకర్స్ ధీమాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే సమంత లుక్ కూడా జాతీయ స్థాయిలో పాపులర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ‘శాకుంతలం’ సినిమాను దిల్ రాజు, గుణశేఖర్ కలిసి నిర్మిస్తున్నారు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ ఓ పాత్రలో తొలిసారిగా నటించింది. ‘పుష్ప’ మూవీ ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న సామ్…. ‘శాకుంతలం’ మూవీతో మరింత క్రేజ్ సాధించడం ఖాయమని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది.
మరోవైపు అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత పూర్తిగా కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. సినిమాల మధ్యలో గ్యాప్ దొరికితే చాలు… తన స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేస్తూ… రిఫ్రెష్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రేమకావ్యంగా రాబోతున్న ‘శాకుంతలం’ సినిమా ద్వారా సమంత ఎంత పెద్ద హిట్ కొడుతుందో చూడాలి. ‘శాకుంతలం’ మూవీకి సంబంధించిన విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
Related News
Ashu Reddy : సమంతను దించేసిన అషు రెడ్డి.. ఇద్దరు ఆ విషయంలో అస్సలు తగ్గట్లేదు..!
Ashu Reddy జూనియర్ సమంతగా పాపులర్ అయిన అషు రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా ఛాన్స్ తెచ్చుకుంది. ఆ సీజన్ లో అమ్మడు చేసిన హడావిడికి సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్స్ ని