POSH Act : వర్కింగ్ ఉమెన్స్‌కు రక్షణ కవచం.. POSH యాక్ట్ వివరాలివీ
POSH Act : పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఘటనలు నిత్యం ఏదో ఒకటి మనదేశంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి.
- By Pasha Published Date - 11:31 AM, Wed - 3 January 24
POSH యాక్ట్ వివరాలివీ..
- మహిళలను అనుచితంగా తాకడం
- మహిళలు శారీరకంగా అసౌకర్యంగా ఫీలయ్యేలా చేయడం
- మహిళలకు సైగలు చేయడం
- లైంగిక వ్యాఖ్యలు చేయడం
- అశ్లీల కంటెంట్‌ను వారికి షేర్ చేయడం
- లైంగిక అంశాలపై ఏదైనా చేయాలని అడగడం
- పై కారణాలతో వర్క్ ప్లేస్‌లో/జాబ్ చేసే చోట ఎవరైనా వేధిస్తే బాధిత మహిళలు నిర్భయంగా posh యాక్ట్ కింద ఫిర్యాదు చేయొచ్చు.
- వర్కింగ్ ఉమెన్స్ నుంచి ఇటువంటి కంప్లయింట్స్‌ను స్వీకరించడానికి ప్రతీ కంపెనీలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంటుంది. ఇలాంటి కమిటీలను ప్రతి సంస్థ ఏర్పాటు చేయాలనేది నిబంధన. ఈ కమిటీలో సగం మంది మహిళలే ఉండాలి. వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఎదుర్కొనే మహిళల ఫిర్యాదులను విచారించి posh యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడమే ఈ కమిటీల పని.
- వేధింపులు ఎదుర్కొన్న 90 రోజుల్లోగా బాధిత మహిళ కంప్లయింట్ చేయొచ్చు. తొలుత ఆఫీసులో కంప్లయింట్ చేయాలి. ఆఫీసు అంతర్గత ఫిర్యాదుల కమిటీ తన విచారణ నివేదికను 10 రోజుల్లోగా సంస్థకు ఇస్తుంది. నిందితులు దోషిగా తేలితే posh యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. అవసరమైతే పోలీస్ స్టేషన్‌ను కూడా ఆశ్రయిస్తారు.
- ఇలాంటి విషయాల్లో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే గౌరవానికి భంగం కలుగుతుందనే భావన మహిళలకు ఉంటుంది. అందుకే కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ విధానాన్ని posh యాక్ట్(POSH Act) ద్వారా అందుబాటులోకి తెచ్చారు.
Related News
Female Grooming: ఆఫీసులకు వెళ్లే మహిళలు ఇవి తప్పకుండ పాటించండి
సాధారణంగా ఆఫీసులకు వెళ్లేవారు ఒక్కొక్కరు ఒక్కో మనస్తత్వంతో ఉంటారు. కొందరికి దుస్తులపై ఉన్న శ్రద్ధ పని మీద ఉండదు. మరికొందరు పనిపై చూపించే శ్రద్ద వారు వేసుకునే దు