HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Several Dead In Road Accident Bihar Muzaffarpur

Bihar Accident: బీహార్ లో దారుణం.. ట్రక్కు దూసుకురావడంతో 12 మంది భక్తులు మృతి!

దేశవ్యాప్తంగా రోజురోజుకీ రోడ్డు ప్రమాదం లో మరణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల

  • Author : Anshu Date : 21-11-2022 - 8:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bihar Accident
Bihar Accident

దేశవ్యాప్తంగా రోజురోజుకీ రోడ్డు ప్రమాదం లో మరణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా బీహార్ రాష్ట్రంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల పైకి ట్రక్కు దూసుకు రావడంతో ఏకంగా 12 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని వైశాలి జిల్లాలో దేస్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నయా గావ్ తోలా గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

హాజీపూర్, మహ్నర్ రోడ్డు పక్కన ఉన్న ఆలయంలో గ్రామస్తులు పూజ చేస్తూ ఉండగా ఇంతలోనే ఒక ట్రక్కు అదుపుతప్పి వారిపై దూసుకు వచ్చింది. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా పరుగులు తీశారు. కానీ రోడ్డు పక్కనే పూజలు చేస్తున్న నలుగురు చిన్నారులతో పాటు మొత్తం 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను హాజీపూర్ సదరు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 12 మందిలో తొమ్మిది మంది అక్కడే ప్రాణాలు కోల్పోగా మరొక ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ప్రమాద ఘటన తనను ఎంతో బాధించిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మృతులకు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షలు అలాగే గాయపడిన వారికి 50,000 ఎక్స్ గ్రేసియా ఇవ్వనట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్ చేసింది. అయితే ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి దినేష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు అందించాలని అధికారులను ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • Bihar Accident
  • muzaffarpur
  • road accident

Related News

Tragic accident in the US: Young woman from NTR district dies.

Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సమయంలో ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న న్యూయార్క్‌లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన జులై 5న చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd