HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Second Us Submarine Makes Port In South Korea Amid North Korea Tensions

USA: కిమ్ ను అదుపుచేయడం కోసం మరో అణు జలాంతర్గామి?

అమెరికాకు చెందిన రెండో అణుశక్తి జలాంతర్గామి దక్షిణ కొరియాలో లంగరేసింది. లాస్‌ ఏంజెల్స్‌ శ్రేణికి చెందిన యూఎస్‌ఎస్‌ అన్నాపోలిస్‌ జలాంతర్గామి

  • Author : Anshu Date : 24-07-2023 - 3:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Usa
Usa

అమెరికాకు చెందిన రెండో అణుశక్తి జలాంతర్గామి దక్షిణ కొరియాలో లంగరేసింది. లాస్‌ ఏంజెల్స్‌ శ్రేణికి చెందిన యూఎస్‌ఎస్‌ అన్నాపోలిస్‌ జలాంతర్గామి జిజు ద్వీపంలో ఆగింది. ఉత్తరకొరియా క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన కొన్ని గంటల్లోనే అమెరికా అణు జలాంతర్గామి ప్రత్యక్షం కావడం గమనార్హం. కాగా శ్రతువుల నౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి అమెరికా ఈ సబ్‌మెరైన్‌ను ఉపయోగిస్తోంది. యూఎస్‌ఎస్‌ అన్నా పోలీస్‌లో ఒక న్యూక్లియర్‌ రియాక్టర్‌ కూడా ఉంది.

కాగా తాజాగా జిజు ద్వీపం నుంచి ఈ సబ్‌మెరైన్‌ కు అవసరమైన నిత్యావసరాలను సేకరిస్తోంది. కానీ, ఉత్తరకొరియా మాత్రం అమెరికా నౌకాదళం దక్షిణ కొరియాకు శిక్షణ ఇస్తోందని అందుకే ఈ జలాంతర్గామి వచ్చిందని అనుమానిస్తోంది. అయితే వారం క్రితం అమెరికా అణు క్షిపణులను ప్రయోగించే సామర్థం ఉన్న జలాంతర్గామి యూఎస్‌ఎస్‌ కెంటకీ బుసాన్‌ రేవుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఇక్కడ ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ అంశమే తాము దక్షిణ కొరియాపై అణుదాడి చేయడానికి కారణం కావచ్చని ఉత్తరకొరియా రక్షణ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. కాగా 1980ల తర్వాత ఒక ఎస్‌ఎస్‌బీఎన్‌ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి.

ఒక అమెరికా సబ్‌ మెరైన్‌ దక్షిణ కొరియా జాలాల్లోకి గత వారం వచ్చింది. ఇది జరిగిన వారంలోపే మరో అణుశక్తి జలాంతర్గామి రావడం గమనార్హం. ఉత్తర కొరియాలోకి చొరబడి అక్కడి దళాలకు దొరికిపోయిన అమెరికా సైనికుడు ట్రావిస్‌ కింగ్‌ అప్పగింతపై చర్చలు మొదలయ్యాయి. యునైటెడ్‌ నేషన్స్‌ కమాండ్‌, ఉత్తరకొరియా ఈ చర్చలు చేపట్టాయి. ఈ విషయాన్ని అమెరికా నేతృత్వంలోని మల్టీనేషనల్‌ కమాండ్‌ వెల్లడించింది. కొరియా యుద్ధం సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ఈ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • north korea
  • south korea
  • us
  • USA

Related News

New Supreme Leader Of Iran

Iran : ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్

ఇరాన్ సుప్రీం లీడర్ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం (IRGC) మరియు విదేశాంగ విధానంపై పూర్తి అధికారం ఉన్న సర్వోన్నత శక్తి. కొత్త నేత రాకతో మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనుసరించే వ్యూహాలు మారవచ్చు

  • Iran Attack

    War : ఇంకో 6 నెలల పాటు యుద్ధం కొనసాగబోతుందా..? ఇరాన్ అదే చెపుతుందా ?

  • India

    ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Iran's president apologises for air strikes on Gulf countries

    ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

  • Russia

    ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd