Heroine : పెళ్లయిన హీరోయిన్ కోసం గూగుల్ లో సెర్చ్
పెళ్లయిన (Marriage) తర్వాత కూడా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
- By Maheswara Rao Nadella Published Date - 03:20 PM, Fri - 16 December 22
పెళ్లయిన (Marriage) తర్వాత కూడా బాలీవుడ్ హీరోయిన్ (Heroine) కత్రినా కైఫ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ లో ఎక్కువగా వెతికిన ఆసియన్ల జాబితాలో ఆమె నాలుగో స్థానం సాధించింది. బాలీవుడ్ నుంచి తనే అగ్రస్థానంలో నిలిచింది. ‘ఆర్ ఆర్ ఆర్‘, ‘బ్రహ్మాస్త్ర’ తో మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ (Heroine) అలియా భట్ ను దాటి కత్రినాకైఫ్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. అలియా భట్ ఐదో స్థానంలో ఉంది. అందం, అభినయంతో మెప్పిస్తున్న కత్రినాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.
‘సూర్యవంశీ’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కత్రినా ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘ధూమ్ 3’, ‘జబ్ తక్ హై జాన్’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ వంటి పెద్ద బాలీవుడ్ చిత్రాల్లో మెప్పించింది. గత ఏడాది డిసెంబర్లో యువ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న కత్రినా ఆ తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తోంది. వివాహబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ఆమె ‘టైగర్-3’, ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రాల్లో నటిస్తోంది.
Also Read: Amitabh Bachchan : వాక్ స్వేచ్ఛ’పై అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలు…ట్విటర్ వార్
Related News
UP University: ఆన్సర్ షీట్లో జై శ్రీరామ్, విరాట్ కోహ్లీ పేరు.. నలుగురు విద్యార్థులు పాస్..!
యూపీలోని జౌన్పూర్ జిల్లా వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ (UP University) అధ్యాపకులు పెద్ద తప్పిదం చేశారు. ఇక్కడ జై శ్రీరామ్ అని ఆన్సర్ షీట్లో రాసిన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.