Schools Reopen : ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభం..?
తెలంగాణ లో ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలను పునఃప్రారంభించే అవకాశం ఉంది.
- By Hashtag U Published Date - 02:30 PM, Sat - 29 January 22

తెలంగాణ లో ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలను పునఃప్రారంభించే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ సిఫార్సులతో ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభానికి పిలుపునిచ్చినట్లు సమాచారం. పాఠశాలలు కఠినమైన కోవిడ్ 19 చర్యలను అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈరోజు పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి ఫిబ్రవరి మొదటి వారం నుండి పాఠశాలలు, కళాశాలల్లో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిపై హరీష్ రావు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 8 నుండి 16 వరకు రాష్ట్రంలోని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం జనవరి 3 న ప్రకటించింది అయితే ఆ సెలవులను జనవరి 31 వరకు సెలవులను పొడిగించింది.