Same-Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహంపై సుప్రీంలో విచారణ
స్వలింగ సంపర్కుల వివాహాన్ని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టింది భారత అత్యున్నత న్యాయస్థానం
- Author : Praveen Aluthuru
Date : 18-04-2023 - 3:10 IST
Published By : Hashtagu Telugu Desk
Same-Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టింది భారత అత్యున్నత న్యాయస్థానం. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. మేం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నామని, ఈ కేసును ఎలా వినాలో నిర్ణయిస్తామని చెప్పారు. విచారణ జరపాలా వద్దా అని చెప్పడానికి మేము ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశారు. సొలిసిటర్ జనరల్ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాబోయే దశలో కేంద్రం వాదనలు వింటామని చెప్పారు.
స్వలింగ సంపర్కుల మధ్య సంఘీభావం కోసం వివాహం అవసరమని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరొక పిటిషనర్ తన పిటిషన్‌లో గే కమ్యూనిటీ ప్రజలు బ్యాంక్ ఖాతాలు తెరవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు దూరమవుతాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. .కాగా… స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
అయితే స్వలింగ సంపర్కుల వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కేంద్రం. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన పిటిషన్లు కేవలం పట్టణ ప్రాంత ప్రముఖుల అభిప్రాయాలను మాత్రమేనని, వాటిని మొత్తం దేశ పౌరుల అభిప్రాయాలుగా పరిగణించలేమని కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Read More: Vamika: వామికాను డేట్‌కి తీసుకెళ్లొచ్చా అంటూ ఫ్లకార్డు.. తీవ్ర విమర్శలకు దారి తీసిన ఫోటో..!