Sania Mirza: సానియా మీర్జా.. ‘ప్రెగ్నెన్సీ సీక్రెట్స్’ ఏంటో తెలుసా?
పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
- By Hashtag U Published Date - 03:22 PM, Mon - 11 April 22

పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సానియా ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తమకు పుట్టబోయే బిడ్డ మంచి రంగుతో పుట్టాలని ఆమె యాపిల్స్ ఎక్కువగా తీసుకున్నట్లు తెలిపారు. క్రికెటర్ నిదా యాసిర్ మార్నింగ్ షో షాన్-ఎ-సుహూర్‌లో నటి ఉష్నా షాతో కలిసి షోయబ్ మాలిక్ ఈ నెల 6న ఓ ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోయబ్ మాలిక్ పలు విషయాలను పంచుకున్నారు. ఒక సమయంలో నెటిజన్లు సానియా మీర్జా రంగును అవమానించారని తెలిపాడు.
దీంతో మా అత్తగారు నా భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉండాలని ఆమెతో చాలా యాపిల్స్ తినిపించినట్లు గుర్తు చేసుకున్నాడు. అలా యాపిల్స్ ఎక్కువగా తినడం వల్లే తమ పిల్లవాడు మంచి యాపిల్ పండు లాంటి రంగుతో పుడతాడని వారి నమ్మకం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే డార్క్ స్కిన్ ఉన్నవారు అందంగానే ఉంటారని, ఫెయిర్ స్కిన్‌ను సౌందర్యానికి ప్రమాణంగా భావించడాన్ని తాను తప్పుపడుతన్నట్లు చెప్పాడు. కాలం చెల్లిన సౌందర్య ప్రమాణాలకు తాను వ్యతిరేకం అని ఫెయిర్ అండ్ లవ్లీ రోజులు పోయాయని, అన్ని షేడ్స్ అందంగానే ఉంటాయని పేర్కొన్నారు. అందానికి ఫార్ములా ఏమీ లేదన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలని షోయబ్ తెలిపారు.