HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Russian President Putin Gave An Offer To Wagner Soldiers

Putin Offer : ప్రైవేట్ ఆర్మీలోని సైనికులకు పుతిన్ ఎమోషనల్ ఆఫర్

Putin Offer : ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ లోని  సైనికులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక ఆఫర్ ఇచ్చాడు.

  • By Pasha Published Date - 07:13 AM, Tue - 27 June 23
  • daily-hunt
Vladimir Putin
Vladimir Putin

Putin Offer : ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ లోని  సైనికులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక ఆఫర్ ఇచ్చాడు. వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ బెలారస్ కు వెళ్లిపోయాడనే టాక్ వినిపిస్తున్న తరుణంలో ప్రెస్ మీట్ పెట్టిన పుతిన్ .. “వాగ్నర్ గ్రూప్ సైనికులు రష్యా  సైన్యంలో చేరండి.. లేదంటే ఇళ్లకు తిరిగి వెళ్లిపోండి.. మీరు యుద్ధ బరిలో వేరే పక్షాన నిలబడితే.. ఒక సోదరుడు తుపాకీ చేతపట్టి  మరో  సోదరుడి ముందు నిలబడినట్టుగా అనిపిస్తోంది” అని కామెంట్ చేశారు. ఒక రకంగా ఎమోషనల్ డైలాగ్ తో(Putin Offer) వారిని ప్రభుత్వ  సైన్యంలోని  ఆహ్వానించారు. “వాగ్నర్ గ్రూప్ యోధులు, కమాండర్లు నిజమైన దేశభక్తులు. వారు తమ ప్రజలకు, దేశానికి ద్రోహం చేయలేరు. వాళ్ళు రష్యా సైనికుల భుజంతో  భుజం కలిపి యుద్ధాలలో పోరాడారు” అని పుతిన్ ప్రశంసించారు. ఇప్పటికే వేలాది మంది వాగ్నర్ గ్రూప్ సైనికులు ఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో విధుల్లో ఉన్నారు. వారంతా రష్యా ఆర్మీలో చేరిపోయే ఛాన్స్ ఉంది . ఎందుకంటే  వాగ్నర్ గ్రూప్ అధినాయకుడు ప్రిగోజిన్ ఇప్పుడు రష్యాలో లేడు. దీంతో ఆ గ్రూప్ లోని సైనికులకు పుతిన్ చూపిన మార్గమే దిక్కు.  

Also read :Panipuri in Train : ట్రైన్‌లో పానీపూరి.. బిజినెస్ ఐడియా భలే ఉందే..

వాగ్నర్ గ్రూప్ అంటే ఏమిటి?

వాగ్నర్ గ్రూప్ అనేది సైనికుల ప్రైవేట్ సంస్థ. 2014కి ముందు ఇది ఒక రహస్య సంస్థ. ఎక్కువగా ఉక్రెయిన్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో చురుకుగా ఉండేది. వీరిలో ఎక్కువ మంది రష్యా యొక్క ఎలైట్ రెజిమెంట్, ప్రత్యేక దళాల అనుభవజ్ఞులు. ఈ సమూహంలో 50 వేల మందికి పైగా ప్రైవేట్ సైనికులు ఉన్నారు. దీన్ని రష్యా మాజీ ఆర్మీ అధికారి దిమిత్రి ఉట్కిన్ ప్రారంభించారు. వాగ్నెర్ గ్రూప్ 2014లో రష్యా ఆర్మీతో కలిసి తన మొదటి ఆపరేషన్‌లో క్రిమియాను ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకుంది.

వాగ్నర్ గ్రూప్ ఎందుకు తిరుగుబాటు చేసింది ?

  • ఉక్రెయిన్‌లోని బఖ్‌ముట్‌లో ఉన్న వాగ్నర్ గ్రూప్ శిక్షణా శిబిరంపై రష్యా ఆర్మీ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో చాలామంది వాగ్నర్ ఫైటర్లు మరణించారు.
  • దీని తర్వాత రష్యా, ప్రైవేట్ ఆర్మీ మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.
  • ఉక్రెయిన్‌లోని తన దళాలపై రష్యా ఆర్మీ జనరల్స్ వైమానిక దాడులకు ఆదేశించారని వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ఆరోపించాడు. తాను రష్యాకు వ్యతిరేకం కాదన్నాడు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, రష్యా ఉన్నతాధికారులపై మాత్రమే ఆరోపణలు చేస్తున్నానని తెలిపాడు.
  • ఉక్రెయిన్ యుద్ధంలో గెలిచిన భూభాగాలను స్వాధీనం చేసుకునే అంశంపై వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ .. రష్యా  రక్షణ మంత్రి సెర్గీ ప్రతిపాదనలతో విభేదించాడు.
  • ఈనేపథ్యంలో రష్యా రక్షణ శాఖ రెండు వారాల క్రితం ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రైవేట్ సైనికులు అందరూ రష్యా సైన్యంలో చేరాలనేది ఆ ఉత్తర్వు సారాంశం. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి వాగ్నర్ నిరాకరించాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • offer to Wagner soldiers
  • Putin Offer
  • return home
  • Russian Army
  • Russian President Putin

Related News

The earphone episode is repeated again.. The incident of Putin becoming a tutor to the Pakistani Prime Minister goes viral!

viral video : ఇయర్‌ఫోన్‌ ఎపిసోడ్‌ మళ్లీ రిపీట్‌..పాక్‌ ప్రధానికి పుతిన్‌ ట్యూటర్‌గా మారిన ఘటన వైరల్‌!

2022లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన SCO సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశమైనప్పుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఇయర్‌ఫోన్‌ పెట్టుకోవడంలో పడిన తంటాలు అప్పట్లో అందరినీ నవ్వించాయి. ఇప్పుడు, 2025లో చైనాలో జరిగిన SCO సదస్సులో అదే సీన్‌ మళ్లీ రిపీట్‌ అయింది.

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd