HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Russia Messiles Attack On Ukrain

Ukrain: ఉక్రెయిన్ పై రాత్రి వేళలో రష్యా దాడులు.. ధ్వంసమైన ఓడరేవు మౌలికా సదుపాయాలు?

ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌ వాసులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గ్యాప్ లేక

  • Author : Anshu Date : 20-07-2023 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ukrain
Ukrain

ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌ వాసులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గ్యాప్ లేకుండా ఉక్రెయిన్ దేశం పై రష్యా దాడులు జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టుగా ఉక్రెయిన్‌ పై రష్యా క్షిపణులు, డ్రోన్ ల సహాయంతో రాత్రి వేళల్లో విరుచుకుపడుతోంది. వీటిని ఉక్రెయిన్‌ తిప్పికొడుతోంది. రష్యా తాజాగా జరిపిన దాడుల్లో దక్షిణ ఉక్రెయిన్‌ లోని ఒడెసా నగరంలో ఉన్న నౌకాశ్రయ కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.

రాత్రి సమయంలో ఒక్కసారిగా డ్రోన్ ల సహాయంతో దాడి చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిలో ఉన్న ధాన్యం, చమురు ఎగుమతి టెర్మినళ్లు కూడా ఉన్నాయి. ఈ దాడులతో 12 మంది పౌరులు గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధికారులు బుధవారం వెల్లడించారు. ఉక్రెయిన్‌ ఓడరేవు నగరం ఒడెసాపై వరుసగా రెండో రోజూ దాడులకు పాల్పడడం గమనార్హం. అలాగే కీవ్‌పై ఇరాన్‌ తయారీ షాహిద్‌ డ్రోన్ లతో రష్యా చేసిన దాడిని అక్కడి గగనతల రక్షణ వ్యవస్థ నిలువరించింది.

కాగా మరోవైపు సైనిక స్థావరంలో మంటలు చెలరేగడంతో ముందుజాగ్రత్త చర్యగా క్రిమియాలోని నాలుగు గ్రామాల నుంచి 2,200 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా అత్యవసర విభాగ అధికారులు వెల్లడించారు. అయితే కిరోవ్‌స్కీ జిల్లాలో రేగిన ఆ అగ్నికీలలకు కారణమేమిటన్నది ఇంకా తెలియరాలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drone
  • russia
  • russia attack on ukrain
  • Ukrain

Related News

Russia

ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

కువైట్‌లో జరిగిన ఇరాన్ దాడిలో 6 మంది అమెరికా సైనికులు మరణించగా, మరికొందరు గాయపడటం గమనార్హం.

    Latest News

    • T20WC 2026 : ఫైనల్ మ్యాచ్ క్రేజ్..కొండెక్కిన హోటల్ రూముల ధరలు

    • War : ఇంకో 6 నెలల పాటు యుద్ధం కొనసాగబోతుందా..? ఇరాన్ అదే చెపుతుందా ?

    • Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?

    • Nayanatara : కండల వీరుడు సరసన నయనతార..ఇది మామలు కాంబో కాదు !!

    • Current Charges : కరెంట్ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్

    Trending News

      • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

      • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

      • ఏ కారు కొంటే మంచిది?!

      • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

      • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd