RTC BUS Accident : చేవెళ్లలో ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
- Author : Prasad
Date : 24-05-2026 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు కారుని ఢీకొట్టింది. ఆర్టీసీ డ్రైవర్ తక్షణ స్పందనతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. మోహదీపట్నం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు ప్రయాణిస్తోంది. యూటర్న్ తీసుకునే సమయంలో కారును .. మల్కాపురం సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కారులో ఎయిర్‌బ్యాగ్‌లు వెంటనే తెరుచుకోవడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తక్షణ స్పందన, సమయస్ఫూర్తితో తీసుకున్న చర్యలతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. బస్సులోని 25 మందికి పైగా ప్రయాణికులను డ్రైవర్ కాపాడారు. సంఘటనపై సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు అక్కడికి చేరుకుని, గాయపడిన కారు ప్రయాణికులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.