Salary 45K-Assets 10 Crore : శాలరీ 45వేలు.. ఆస్తి 10 కోట్లు.. దొరికిపోయిన అవినీతి చేప
Salary 45K-Assets 10 Crore : అతడు ఒక చిరుద్యోగి.. నెల జీతం రూ. 45 వేలే!! మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖలో షాప్ కీపర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు..
- By Pasha Published Date - 11:43 AM, Wed - 9 August 23

Salary 45K-Assets 10 Crore : అతడు ఒక చిరుద్యోగి.. నెల జీతం రూ. 45 వేలే!!
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖలో షాప్ కీపర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు..
రూ.10 కోట్లకుపైగా ఆస్తులను అతడు కూడగట్టాడని తెలిసి రైడ్స్ కు వెళ్లిన అధికారులు అవాక్కయ్యారు..
అష్పక్ అలీ అనే అవినీతి చేప మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లోకాయుక్త అధికారులకు దొరికింది.
Also read : Pawan Kalyan: ఆ దృశ్యాలు చూస్తే గుండె బరువైపోతుంటుంది: పవన్ కళ్యాణ్ ఎమోషనల్
ఆరోగ్యశాఖలో షాప్ కీపర్‌గా పనిచేసి నెలకు రూ. 45 వేల వేతనంతో రిటైర్ అయిన అష్పక్ అలీకి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు లోకాయుక్తకు సమాచారం అందింది. దీంతో భోపాల్‌లో ఉన్న అష్పక్ అలీ ఇంటిపై లోకాయుక్త అధికారులు రైడ్స్ చేశారు. ఈ సోదాల్లో రూ. 46 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు రూ. 20 లక్షల నగదు దొరికింది. విలాసవంతమైన ఆ ఇంట్లో మాడ్యులర్ కిచెన్, లక్షల విలువైన షాండ్లియర్, ఖరీదైన సోఫాలు, షోకేస్‌లు, రిఫ్రిజిరేటర్లు, టీవీ ఉన్నాయి. అలీ గతంలో మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో స్టోర్ కీపర్‌గా పనిచేశాడు. ఆయన ఆస్తుల విలువ రూ. 10 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలీ భార్య, కుమారుడు, కుమార్తె పేరిట ఉన్న రూ. 1.25 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 16 స్థిరాస్తుల పేపర్లు(Salary 45K-Assets 10 Crore) ఇంటిలో దొరికాయి. వీటితో పాటు నాలుగు భవనాలు, ఒక నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గురించి కూడా సమాచారం దొరికింది. అష్పక్ అలీ తన మూడంతస్తుల భవనంలో ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అవినీతి నిరోధక చట్టం కింద అష్పక్ అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read : Police Case On Chandrababu : చంద్రబాబుపై హత్యాయత్నం కేసు.. అంగళ్లు ఘటనలో ఏ1గా చేర్చిన పోలీసులు