AP Bus Accident : దర్శి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ప్రకాశం జిల్లా దర్శి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం కాకినాడలో జరిగే
- Author : Prasad
Date : 11-07-2023 - 8:06 IST
Published By : Hashtagu Telugu Desk
AP Bus Accident :ప్రకాశం జిల్లా దర్శి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం కాకినాడలో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు పొదిలికి చెందిన ఓ వివాహ బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. వీరిలో 45 మంది పొదిలిలోని పెద్ద మసీదు సెంటర్‌లో బస్సు ఎక్కారు. బస్సు తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో దర్శిలోని సాగర్ కాలువలో అదుపు తప్పి పడిపోయింది.
ప్రకాశంజిల్లా ఎస్పీ మాలిక గార్గ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెన్నైలో పనిచేస్తున్న డీఎస్పీ కుటుంబసభ్యులతో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితులను షేక్ అబ్దుల్ అజీజ్, ఉమెహాని, సబీహా, షిమా, జానీ బేగం, రమేజ్, నూర్జహాన్‌లుగా గుర్తించారు. రమేజ్ చెన్నైలో డిఎస్పీగా పనిచేస్తున్న షేక్ రియాజుద్దీన్ భార్య, నూర్జహాన్ అతని సోదరిగా పోలీసులు గుర్తించారు.
VIDEO | Several people killed after a bus fell into a canal in Andhra Pradesh's Prakasam district earlier today. pic.twitter.com/wZ03asZOjB
— Press Trust of India (@PTI_News) July 11, 2023