2 Killed in Road accident : మంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మంగళూరు సమీపంలోని పడుపనంబూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు
- Author : Prasad
Date : 03-02-2023 - 6:44 IST
Published By : Hashtagu Telugu Desk
మంగళూరు సమీపంలోని పడుపనంబూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. మంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 66పై ఈ ప్రమాదం జరిగింది. మృతులు బబ్లూ, అచల్ సింగ్‌లుగా గుర్తించారు. అనీష్ అనే మరో వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ముగ్గురు వ్యక్తులు లారీలో కేరళకు వెళ్తున్నారు. లారీ టైర్ పంక్చర్ కావడంతో దానిని మార్చేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. కారు డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.