2 Killed : కలపర్రు టోల్‌గేట్ వద్ద కారు బోల్తా.. ఇద్దరు మృతి
ఏపీలోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జిల్లాలోని పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ వద్ద కారుబోల్తా
- Author : Prasad
Date : 23-07-2023 - 9:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జిల్లాలోని పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ వద్ద కారుబోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఏలూరు నుంచి గుడివాడ వెళ్తున్న కారు జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో శారద (66), డ్రైవర్ శ్రీను (45) ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసే నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.