HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rjd Leader Prabhunath Singh Gets Life Imprisonment In 1995 Double Murder Case

Poll Day – Double Murder : తనకు ఓటేయలేదని ఇద్దర్ని చంపిన లీడర్.. 28 ఏళ్ల తర్వాత దోషిగా ఖరారు

Poll Day - Double Murder : తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేశారనే కోపంతో ఇద్దరు అమాయక ఓటర్లను కాల్చి చంపిన ఆర్జేడీ పార్టీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.

  • Author : Pasha Date : 01-09-2023 - 1:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Poll Day Double Murder
Poll Day Double Murder

Poll Day – Double Murder : తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేశారనే కోపంతో ఇద్దరు అమాయక ఓటర్లను కాల్చి చంపిన ఆర్జేడీ పార్టీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. 1995 సంవత్సరంలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభునాథ్ బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. తనకు ఓటు వేయలేదనే అక్కసుతో.. ఆ టైంలో సరణ్‌ జిల్లాలోని చాప్రాలో ఇద్దరు వ్యక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో ప్రభునాథ్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ 2008లో లోకల్ కోర్టు,  2012లో పాట్నా హైకోర్టు తీర్పులు ఇచ్చాయి. అయితే ఈ తీర్పులపై న్యాయపోరాటం కొనసాగిస్తూ చివరకు సుప్రీంకోర్టు తలుపుతట్టిన బాధిత కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం దక్కింది. ప్రభునాథ్ ను దోషిగా తేల్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. గతంలో పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.

Also read : Sriharikota: రాకెట్ ప్రయోగాలు శ్రీహరికోట నుండే ఎందుకు జరుగుతున్నాయి..? అక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారు..?

దీంతో ఆ ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత అత్యంత ఆలస్యంగా ప్రభునాథ్ కు శిక్ష ఖరారైంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం అందించాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా, 1995లో జరిగిన ఎన్నికల్లో ప్రభునాథ్‌పై గెలిచిన ఎమ్మెల్యే అశోక్‌ సింగ్‌ కూడా హత్యకు గురయ్యారు. ఆ కేసులోనూ ప్రభునాథ్ దోషిగా తేలడంతో 2017లో హజారీబాఘ్‌ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఇక, గతంలోకి వెళితే తొలుత బీజేపీ ఆ తర్వాత జనతాదళ్‌, జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీల్లోకి వెళ్లిన ప్రభునాథ్ ప్రస్తుతం ఆర్జేడీలో ఉన్నారు. ఇంతపెద్ద నేర చరిత్ర కలిగిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎంపీగా (Poll Day – Double Murder) గెలవడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1995 year
  • double murder case
  • Life imprisonment
  • Poll Day - Double Murder
  • Prabhunath Singh
  • RJD leader
  • Supreme Court

Related News

Telangana Cm Revanth Reddy

CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

2016 నాటి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. గతంలో ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు, రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ (Quash) తీర్పునిచ్చింది.

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

Latest News

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

Trending News

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd