Chay & Sam: సమంత, నాగచైతన్య విడాకులు ఎందుకు తీసున్నారంటే!
సౌత్ స్టార్స్ నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభు అక్టోబర్ 2 న విడిపోతున్నట్లు ప్రకటించారు.
- By Balu J Published Date - 01:02 PM, Fri - 22 July 22
సౌత్ స్టార్స్ నాగ చైతన్య, సమంత గత సంవత్సరం అక్టోబర్ 2 న విడిపోయినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను విడిపోవడానికి గల కారణాలను సమంత ఇంటర్వ్యూలో ఓపెన్ కామెంట్స్ చేస్తుండగా, నాగచైతన్య మాత్రం చాలా సైలంట్ గా ఉంటున్నాడు. కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో పాల్గొన్న సమంత మరోసారి మరోసారి విడాకుల వ్యవహరం గురించి మాట్లాడింది. “ విడాకుల వ్యవహరం చాలా కష్టమైంది. కానీ నాకు మాత్రం ఇప్పుడు బాగుంది. గతంలో కంటే ఇప్పుడే బలంగా ఉన్నా. మా ఇద్దరి మధ్య చాలా వైరుధ్యాలున్నాయి. ఇద్దరి అభిప్రాయాల్లో భేదాలుండటంతో విడిపోవాలనుకున్నాం. భవిష్యత్తులో కలిసి ఉండలేమని నిర్ణయించుకున్న తర్వాతనే బ్రేకప్ నిర్ణయం తీసుకున్నాం’’ అని సమంత స్పష్టం చేసింది.
అయితే సమంతా ఎప్పుడూ పిల్లలను కోరుకోలేదని, అబార్షన్లు చేయించుకుందని వార్తలు కూడా వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లన్నీ సమంత చెప్పింది. విడాకుల వ్యవహరం చాలా కష్టమైన ప్రక్రియ. అండగా ఉండాల్సినవాళ్లు రూమర్స్ క్రియేట్ చేశారు. నాకు పిల్లలు వద్దనీ, అవకాశవాదినని, అబార్షన్లు చేయించుకున్నానని తప్పుడు ప్రచారం చేశారని సమంత గుర్తు చేసుకుంది. తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించే పాత్రలను తాను చేయనని నాగ చైతన్య ఇటీవల తన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నాగ చైతన్య మాత్రమే కాదు, సమంతా అత్తమామలు కూడా తెరపై బోల్డ్ సన్నివేశాలు చేయడం కోడలికి తగదని చెప్పారని వార్తలు కూడా వచ్చాయి. అయితే బ్రేకప్ తర్వాత సమంత కెరీర్ జట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా ఐటెంసాంగ్, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, హాలీవుడ్ లో లెస్బియన్ లాంటి బోల్డ్ పాత్రలకు సై అంది సమంత.
Related News
Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక వృత్తాంతం
హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది...ప్రధానంగా హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా ప్రస్తావింపబడింది...హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అని అనడంలో అతిశయోక్తి లేదు.