HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Revanths Key Decision On Dump Yards In Hyderabad

CM Revanth: హైదరాబాద్ డంప్ యార్డులపై రేవంత్ కీలక నిర్ణయం

  • Author : Balu J Date : 06-01-2024 - 8:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Revanth Reddy
Cm Revanth Reddy

CM Revanth: హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు వున్నది. ప్రతి రోజు సుమారు 8వేల టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరవేయడం జరుగుతున్నది. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడువాసన వంటి వాటితో చుట్టు ప్రక్కల వుండే ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్ లను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.

చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు గాను టిఎస్ఎస్పీడీసిఎల్ తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంతవరకు రీసైకిల్ చేయాలని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలందిస్తామన్నారు. ఇక సీఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టతను ఇచ్చారు. గతంలో గచ్చిబోలి – ఎయిర్ పోర్టు వరకు 32కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో అధికంగా ధనికులు వుండటం వల్ల వారు ఎక్కువగా స్వంత వాహనాలు వాడుతున్నారని అన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్ నుమా – ఏయిర్ పోర్టు రూట్, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు వున్నాయని అన్నారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళుతుంటారని, విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్ పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇస్తుంటారని అందుకే ఈ రూట్ చాలా ఉపయోగకరంగా వుంటుందని సిఎం అభిప్రాయపడ్డారు.

మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ది చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్ రోడ్ టూ రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లలతో అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఎరియా, షాపింగ్ మాల్స్ లతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలయిన చార్మినార్, గొల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్ ను రూపొందించాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పిపిపి మోడల్ లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cleaning
  • cm revanth
  • hyderabad
  • key decision

Related News

Ktr Comments Revanth

నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన

రాహుల్ గాంధీని తాను కొత్తగా ఏం అనలేదని, గతంలో రేవంత్ చెప్పిన మాటలనే తిరిగి అన్నానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై ఫైరవ్వడంపై ఆయన స్పందించారు. 'రాహుల్ పప్పు కాదు ముద్ద పప్పు అని గతంలో రేవంత్ అన్నాడు

  • Musi River

    Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

  • Goat Sheep

    గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..

  • Divorce Hyd

    భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

  • NTR Dragon shooting Hyderabad

    హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్

Latest News

  • తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్‌ ధరల పెంపు

  • శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

  • గ్రీన్‌లాండ్‌ విషయంలో తగ్గేదిలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

  • ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

  • గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd