Revanth On KCR:కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర రేవంత్ మీటింగ్
డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తామని రైతులంతా ఎర్రవెల్లి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలందరూ వస్తారని రేవంత్ తెలిపారు.
- By Siddartha Kallepelly Published Date - 11:33 PM, Fri - 24 December 21

డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తామని రైతులంతా ఎర్రవెల్లి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలందరూ వస్తారని రేవంత్ తెలిపారు.
గత మూడు నెలలుగా రైతులు అరిగోస పడుతున్నారని, తెలంగాణ రైతుల పరిస్థితి కళ్లాల్లో
వరి కుప్పలు, ఇంటి ముందు శవాలుగా ఉందని రేవంత్ తెలిపారు. ఈ సమస్య పరిష్కరిస్తానని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ మోదీని కలవలేదని, రైతు సమస్య వివరించలేదని, ఇక
కేటిఆర్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గడ్డి పెట్టి పంపించారని రేవంత్ తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్
సెంట్రల్ హాల్లో ఫోటోలు దిగి పార్లమెంట్ లో ఆందోళన చేసినట్లు తప్పుదోవపట్టిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఇక ఇప్పుడు
ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని, మంత్రుల బృందం ఏం తేల్చిందని రేవంత్ ప్రశ్నించారు. రైతులు చనిపోతుంటే కేటీఆర్, సంతోష్ రావు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ఆరు రోజులుగా కేటీఆర్, సంతోష్ ఎక్కడున్నారని, మంత్రుల బృందంలో కేటీఆర్, ఎంపీల బృందం లో సంతోష్ రావు ఎందుకు లేరని రేవంత్ ప్రశ్నించారు.
ఖరీఫ్ లో ఎంత కొంటారో చెప్పేవరకు, యాసంగి బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పేవరకు ఢిల్లీ లో ఆమరణ దీక్ష చేయండని టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సూచించారు. ఏది తేలకుండా మంత్రుల బృందం వెనక్కి వస్తే మిమ్మల్ని ఆడంగులు, కొజ్జాలు అనాల్సి వస్తుందని, వాళ్ళకి గాజులు, చీరెలు ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ తెలిపారు.
ప్రజల్ని మభ్యపెట్టడానికి గులాబీ నేతలు వీధినాటకాలకు తెరలేపారని, రైతులేవరు చనిపోవద్దని, రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు.