HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Request To Ktr To Protect Toddy Societies

KTR: కల్లు సొసైటీలను కాపాడాలంటూ కేటీఆర్ కు వినతి

  • Author : Balu J Date : 11-11-2023 - 6:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
Ktr

KTR: హైదరాబాద్ లోని కల్లు సొసైటీలను కాపాడాలని కోరుతూ మున్సిపల్, ఐటి శాఖా మాత్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని ప్రగతి భవన్ లో శనివారం తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ లోని 69 కల్లు సొసైటీలపై ఇటీవల జరిగిన నార్కోటిక్స్ అధికారుల దాడుల గురించి వివరించారు. ఈ విషయయంపై ఇప్పటికే ఎక్సయిజ్ కమిషనర్, డిజిపి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, నగర కమిషనర్ లను కలిసి వినతి పత్రాలను అందజేసినట్లు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. నార్కోటిక్స్ అధికారులు పోలీస్, సీఆర్పీఎఫ్ అధికారులతో కలిసి ఆయుధాలతో దాడులు జరిపితే తామేమన్నా ఉగ్రవాదులమా అని గౌడ్స్ అంతా భయభ్రాంతులకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేసినట్టు కేటీఆర్ కి వివరించారు. దీని పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ పదేళ్లు గౌడ్స్ ని కడుపులో పెట్టుకొని చూశామన్నారు.

గౌడ్స్ కష్టాలను రాకుండా చూశామన్నారు. ఈ దాడుల వెనుక జాతీయ పార్టీల కుట్ర దాగి ఉందన్నారు. గౌడ్స్ అంతా బిఆర్ఎస్ వెంట వున్నారని తలచి దాడులతో భపెట్టిస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. గౌడ్స్ ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ మాట్లాడుతూ 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు సొసైటీలను మూసివేస్తే వాటిని తెరిపించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. గౌడ్స్ కోసం అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 20 కోట్ల రూపాయల రెంటల్స్ రద్దు చేశారన్నారు. హరిత హారంలో భాగంగా 4 కోట్ల మొక్కలు నటించారన్నారు. నీరా కేఫ్ ఏర్పాటు చేసి కల్లు గౌరవం పెంచారన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్దంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందన్నారు. వైన్స్ ల్లో గౌడ్స్ కి 15 శాతం రిజర్వేషన్లు. గౌడ్స్ ఆత్మగౌరవ భవనం కోసం కోకపేటలో 5 ఎకరాలు మరియు రూ.5 కోట్లు ఈ ప్రభుత్వమే అందించిందన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలు గౌడ్స్ కి అందుతుండడంతో గౌడ్స్ బిఆర్ఎస్ వెంట వున్నారని అన్నారు. గౌడ్స్ ని భయభ్రాంతులతో బిఆర్ఎస్ పార్టీ కి దూరం చేయాలన్న కుట్ర కొన్ని పార్టీలు పాల్పడుతున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా బిఆర్ఎస్ పార్టీ వెంటే గౌడ్స్ వున్నారని స్పష్టం చేశారు. గౌడ్స్ మేలు కోరే ప్రభుత్వం బిఆర్ఎస్ అని గౌడ్స్ మద్దతు బిఆర్ఎస్ కేనని పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • ktr
  • toddy
  • toddy shops

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd