Rent Dad Service: ఇదేందయ్యా ఇది.. ఇకపై అద్దెకు దాడి దొరుకుతాడట?
మామూలుగా మనం అద్దెకు సామాన్లు వస్తువులు ఇవ్వడం చూసి ఉంటాం. కానీ కాలం మారిపోవడంతో ప్రస్తుత. రోజుల్లో మనుషులను కూడా అద్దెకు ఇచ్చే రోజులు కూడా
- Author : Anshu
Date : 04-07-2023 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా మనం అద్దెకు సామాన్లు వస్తువులు ఇవ్వడం చూసి ఉంటాం. కానీ కాలం మారిపోవడంతో ప్రస్తుత. రోజుల్లో మనుషులను కూడా అద్దెకు ఇచ్చే రోజులు కూడా వచ్చేసాయి. ఆ మధ్యకాలంలో ఒకసారి అద్దెకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దొరుకుతారు అన్న విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పుడు అద్దెకి ఏకంగా డాడీ దొరుకుతాడట. వినడానికి కాస్త విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే..అద్దెకు దొరికే డాడీ కన్న తండ్రిలా పిల్లలను చూసుకుంటుంటే మమ్మీ ఎంచక్కా చిల్ అవ్వొచ్చు.
ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందిస్తున్నారు. అలాగే ఉద్యోగల్లో ఉంటూ పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు నిశ్చింగా అప్పగించి, తాము చిల్ అవగలుగుతున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టును అనుసరించి చైనాలోని ఒక బాత్‌హౌస్ అద్దెకు తండ్రులను అందించే సేవలను ప్రారంభించింది. చైనాలో బాత్ హౌస్‌లు ఎంతో ఆదరణ పొందుతూ ఉంటాయి. జనం రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు.
ఈ బాత్‌హౌస్‌లకు పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సెక్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడికు వచ్చే కొందరు మహిళలు తమ చిన్నపిల్లలను తీసుకుని స్నానం చేయించుకునేందుకు, మసాజ్ చేయించుకునేందుకు వస్తుంటారు. వీరి ఇళ్లలో పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతోనే వారు పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తుంటారు. అయితే పిల్లలను పక్కనే ఉంచుకుని స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ సమయంలో పిల్లలను పట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. మహిళల ఇటువంటి ఇబ్బందులను గ్రహించిన ఒక బాత్‌హౌస్ డాడీ ఆన్ రెంట్ సేవలను ప్రారంభించింది. మహిళలు బాత్‌హౌస్‌కు వచ్చినప్పుడు వారి పిల్లలను ఈ అద్దె డాడీలు చూసుకుంటారు. అప్పుడు ఆ చిన్నారుల మమ్మీ హాయిగా బాత్‌హౌస్‌లో చిల్ అవుతారు. ఈ డాడీ ఆన్ రెంట్ సేవలు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి..