Jagtial Sub Jail: జగిత్యాల సబ్ జైలులో గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
జగిత్యాల సబ్ జైలులో గుండెపోటుతో ఖైదీ మృతి. రేప్ కేసులో నిందితుడిగా ఉన్న రామన్నపేట మాజీ ఉప సర్పంచ్ మల్లేశం మరణం.
- Author : Kode Mohan Sai
Date : 19-12-2024 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
జగిత్యాల సబ్ జైలులో ఓ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం గురువారం ఉదయం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మల్లేశం, బుధవారం మధ్యాహ్నం గుండె నొప్పి రావడంతో, సబ్ జైల్ నుండి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న మల్లేశం ఈ రోజు మరణించాడు.
15 రోజుల క్రితం రేప్ కేసులో నిందితుడిగా మల్లేశం జగిత్యాల సబ్ జైలుకు రాగా, ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపిస్తున్నారు. మల్లేశం రామన్నపేట మాజీ ఉప సర్పంచ్. మరిన్ని వివరణల కోసం, మల్లేశం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చనిపోయే వరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వారు కోర్టును ఆశ్రయించి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.