Medigadda case : హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.
- Author : Latha Suma
Date : 24-12-2024 - 12:35 IST
Published By : Hashtagu Telugu Desk
Medigadda case : తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురవడంపై దాఖలైన పిటిషన్‌పై భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. అలాగే ఫిర్యాదుదారుడికి కోర్టు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల (జనవరి) 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇటీవలే మేడిగడ్డ కుంగుబాటు పై కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.
అయితే ఆనోటీసులను కేసీఆర్, హరీష్ రావులు చేసి.. తెలంగాణ రాష్ట్ర హై కోర్టుకు వెళ్లారు. దీంతో కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై రాజలింగం అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన భూపాల్లి కోర్టు.. కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, అలాగే బీఆర్‌ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులకు జూలై 10న నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరుకావాలంటూ కేసీఆర్, హరీష్ రావులను భూపాలపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో కేసీఆర్, హరీష్‌రావులు భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు.
ఇక, మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టు విచారణ జరిపింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయడంతో పాటు ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.
Read Also: Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు? కారణమిదే?