Camera Phone: హైక్వాలిటీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా..?రియల్ మీ బెస్ట్ ఆప్షన్…!
- By Hashtag U Published Date - 06:30 AM, Mon - 31 January 22
రియల్ మీ తన యూజర్లకు భారీ డిస్కౌంట్స్ తో స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. మంచి క్వాలిటీ కెమెరాలు, అత్యధిక సమార్ధ్యం కలిగిన బ్యాటరీతో ఈ కొత్త ఫోన్లు ప్రతిరోజూ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ అందించింది. కంపెనీ తన యూజర్ల కోసం అనేక రకాల ఆఫర్స్ ను ఇస్తోంది. మొబైల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ గురించి చర్చించినట్లయితే రియల్ మి c21-yని రూ.900 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత ఈ మొబైల్ రూ. 8,599కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దాని ట్రిపుల్ కెమెరా పనితీరు. రియల్ మి c21y6.5అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 720×1600 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉండటంతోపాటుగా ఫోనులో ఆక్టాకోర్ యూనిసోక్ T610ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం mali-G52 GPU, 4జిబి వరకు ర్యామ్, 64 జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ కు ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యుఐ అందించారు.
ఇక ఈ ఫోనులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. దీని ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్. కాగా అందులో 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ తోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్నార్ ఉన్నాయి. సెల్ఫీ వీడియో కాలింగ్ కోసం యూజర్లు ఫోనులో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ ను రూపొందించారు.
కనెక్టివిటీ కోసం రియల్ మీ C21Y ఫోనులో LTE, wi-fi బ్లూటూత్ వి5, gps, 3.5mmహెడ్ ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం మైక్రో యూఎస్బి పోర్టు ఉన్నాయి. సెన్సార్లలో మాగ్రెటిక్ ఇండక్టివ్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్ ఉన్నాయి. మొబైల్ వెనక ప్యానెల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇవ్వబడింది. పవర్ కోసం ఈ ఫోన్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కు సపోర్టు ఇస్తుంది.
Related News
Big Discounts: ఈవీ కార్లపై టాటా మోటార్స్ భారీగా డిస్కౌంట్లు.. ఈ ఆఫర్ ఎప్పటివరకు అంటే..?
టాటా మోటార్స్ ఈ ఏడాది చివర్లో తన మొత్తం EV పోర్ట్‌ఫోలియోపై బంపర్ డిస్కౌంట్లను (Big Discounts) అందిస్తోంది.