Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Real Story Behind Honour Killing In Telangana

Honour Killing Facts: భువనగిరి పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు..!!

భువనగిరి పరువు హత్య కేసులో కీలక పరిణామం బయటకు వచ్చింది. రూ. 10లక్షలు సుఫారి ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడు భార్గవి తండ్రి వెంకటేశ్.

  • By Hashtag U Published Date - 09:39 AM, Mon - 18 April 22
Honour Killing Facts: భువనగిరి పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు..!!

భువనగిరి పరువు హత్య కేసులో కీలక పరిణామం బయటకు వచ్చింది. రూ. 10లక్షలు సుఫారి ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడు భార్గవి తండ్రి వెంకటేశ్. పరువు కోసమే అల్లుడిని చంపించాడు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. భూమి కావాలంటూ రామకృష్ణను ట్రాప్ చేశారు నిందితులు. ముందుగా భూమి కావాలని జిమ్మాపూర్ సర్పంచ్ భర్త యాకయ్య… వెంకటేశ్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత రామకృష్ణకు లతీఫ్‌ను యాకయ్య పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే రామకృష్ణను లతీఫ్ గ్యాంగ్ హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసింది. తర్వాత సిద్ధిపేట దగ్గర హత్య చేసి పాతిపెట్టేశారు. ఈ కేసులో భార్గవి తండ్రి వెంకటేశ్ సహా 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రామకృష్ణను హత్య చేసిన లతీఫ్ గ్యాంగ్ అతని భార్య భార్గవిని కూడా బెదిరించింది. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ చూపించాల్సిందిగా లతీఫ్… రామకృష్ణకు ఫోన్ చేసి పిలిచాడు. నమ్మకం కలిగించేందుకు రామకృష్ణ ఖాతాకు కొంత డబ్బు కూడా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఈ విషయం అతని భార్య భార్గవికి కూడా తెలుసు. దీంతో లతీఫ్‌కు ఫోన్ చేసిన భార్గవి తన భర్త ఆచూకీ గురించి అడిగింది. అయితే లతీఫ్ భార్గవిని కూడా బెదిరించాడు.

రామకృష్ణ 2020 ఆగష్టు 16న భార్గవిని ప్రేమ వివాహం చేసుకొన్నాడు. స్వంత గ్రామం లింగరాజుపల్లెలోనే భార్యతో రామకృష్ణ కాపురం పెట్టాడు. అయితే భార్గవి గర్భవతి కావడంతో తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి రావడంతో తన నివాసాన్ని భువనగిరికి మార్చాడు. ఈ మధ్యే భార్గవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తుర్కపల్లి గుప్తనిధుల కేసులో రామకృష్ణ సస్పెండ్ కు అయ్యాడు. దీంతో రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణను లతీఫ్ భూమిని చూపించాలని పిలిపించి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ మామ వెంకటేష్ సూచనలతోనే లతీఫ్ గ్యాంగ్ రామకృష్ణను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు.

Tags  

  • bhongir
  • home guard
  • honour killing

Related News

Honour Killings:  కన్నపేగును తెంచడమే పరువా?

Honour Killings: కన్నపేగును తెంచడమే పరువా?

అహంకారాన్ని ఎదిరించినందుకు కన్నపేగు అని కూడా చూడకుండా హతమార్చడమే పరువు హత్య. ఇక్కడ కులం, మతం, ప్రాంతం, జాతి అనే తేడాలు ఉండవు.

  • Crime: నా భర్తను 35 సార్లు ఇనుప రాడ్ తో కొట్టారు.. జనాలు వీడియోలు తీశారే తప్ప అడ్డుకోలేదు: సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా

    Crime: నా భర్తను 35 సార్లు ఇనుప రాడ్ తో కొట్టారు.. జనాలు వీడియోలు తీశారే తప్ప అడ్డుకోలేదు: సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా

  • Murder: పరువు కోసం అల్లుడిని చంపిన మామ..!!!

    Murder: పరువు కోసం అల్లుడిని చంపిన మామ..!!!

Latest News

  • Viral Video: మొదటిసారి బాదంను తిన్న ఉడుత.. రియాక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే!

  • Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారుల‌తో హైద‌రాబాద్ సీపీ రివ్యూ మీటింగ్‌

  • Cyber Fraud : సైబర్ మోసంలో రూ.39 లక్ష‌లు పోగొట్టుకున్న హైదరాబాద్ యువతి

  • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

  • Team England: టెస్ట్ క్రికెట్ కు సరికొత్త ఊపు తెచ్చిన ఇంగ్లాండ్

Trending

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

    • Taliban Commander : మిలిటరీ ఛాపర్‌లో నవ వధువును ఇంటికి తీసుకెళ్లిన తాలిబ‌న్ క‌మాండ‌ర్‌

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: